
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాలో అలనాటి నాటి బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం తెలిసిందే. సాధ్విగా మారిన ఆమె తన పేరును ‘మాయీ మమతానంద్ గిరి’గా మార్చుకున్నారు.
తాజాగా, ఆమె మహామండలేశ్వర పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. కానీ, సాధ్విగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశారు. సన్యాసం తీసుకున్న వెంటనే మమతా కులకర్ణిని కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవిలో నియమించడం వివాదాస్పదమైంది. ఆమెకు అత్యున్నత స్థానం కట్టబెట్టడంపై పలువురు ఆధ్యాత్మికవేత్తలు, చాలా అఖాడాలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో అఖాడాలోని ఆమె చేరిన తర్వాత అక్కడ సభ్యుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుకైప మహా కుంభమేళాలో కొందరు అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ సైతం పరోక్షంగా మమతా కులకర్ణి వ్యవహారంపై విమర్శలు గుప్పించారు.
ఇప్పటి వరకు ప్రాపంచిక సుఖాల్లో మునిగితేలిన వ్యక్తులు ఒక్కసారిగా సన్యాసులుగా మారిపోయి మహామండలేశ్వర్ వంటి పదవులను కూడా పొందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కిన్నార్ అఖాడా వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్, మమతా కులకర్ణి గురువు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి మధ్య విభేదాలు తలెత్తాయి. అజయ్ దాస్‌పై విమర్శలు గుప్పించిన త్రిపాఠీ అఖాడా నుంచి ఆయన బయటకు వెళ్లి, కుటుంబంతో కలిసి నివసిస్తున్నారని ఆరోపించారు.
అంతేకాదు, తమ కట్టుబాట్లు, నియమాల ప్రకారం కుటుంబంతో సంబంధాలు కొనసాగిస్తోన్న వారికి ఈ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కులేదని అన్నట్టు తెలుస్తోంది. ఈ వివాదాల మధ్యే మమతా కులకర్ణిని అఖాడా నుంచి బహిష్కరించారు. దీంతో మహామండలేశ్వర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ పెట్టారు. కానీ, సాధ్విగా కొనసాగుతానని చెప్పారు.
‘‘నేను మహామండలేశ్వర్ మాయీ మమతా నందగిరి.. ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. కిన్నార్, మరో రెండు అఖాడాల మధ్య నా విషయంలో తలెత్తిన సమస్యతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను గత 25 సంవత్సరాలుగా సాధ్విగా ఉన్నాను. ఇప్పుడు నేను సాధ్విగానే ఉంటాను. నేను 25 సంవత్సరాల కిందటే బాలీవుడ్‌ను వదిలిపెట్టాను. సినిమాలకు నేను దూరంగా ఉన్నాను. 25 ఏళ్ల నుంచి మేకప్ లేకుండా నాలా ఎవరు దూరంగా ఉంటారు?’’ అని ప్రశ్నిస్తూ ఆమె పోస్ట్ పెట్టారు.
90వ దశకంలో బాలీవుడ్‌లో మమతా కులకర్ణి పేరు మార్మోగిపోయింది. గ్లామర్ పాత్రలతో మాధురీ దీక్షిత్ వంటి స్టార్లకు పోటీగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ, 2003 తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన ఆమె విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసులో ఆమెపై ఆరోపణలు రాగా పోలీసులు నోటీసులు సైతం పంపారు. చివరకు రెండు దశాబ్దాల తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్‌కు వచ్చిన మమతా కులకర్ణి అందరినీ ఆశ్చర్యపరుస్తూ సన్యాసం స్వీకరించారు.
More Stories
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
1977లో ఓటమి భయంతో ఆర్ఎస్ఎస్ చెంతకు ఇందిరా గాంధీ!
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!