
బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్ర అని బిజెపి నిజామాబాదు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చడం ఖాయమని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన గొప్పగా చేసాము, మా అంత గొప్ప పార్టీ, గొప్ప నాయకులు దేశంలో ఎవరూ లేరన్నట్టు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని బీసీ వర్గం ప్రజలను మోసం చేసే కుట్ర అసెంబ్లీలో జరిగిందని ఆరోపించారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన పెద్ద డ్రామా అని ఆరోపించారు. గత ప్రభుత్వం లెక్కల ప్రకారం 1.85 కోట్లకు పైగా అంటే 51 శాతం ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ లెక్కల ప్రకారం 1.65 కోట్లు అంటే 46.25 శాతంకు తగ్గిపోయారని చెబుతూమరి దాదాపు 21లక్షల బీసీలు ఏమైనారని ఆయన ప్రశ్నించారు.
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలనేదానికి తాము వ్యతిరేకం కాదని, కానీ బీసీ కులగణన పేరుతో మైనారిటీ వర్గాన్ని బీసీలో కలిపే కుట్ర చేసినట్లు తమకు అనుమానం వస్తుందని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని చెబుతూ ఒక్క దానికైనా కనీసం శంకుస్థాపన చేశారా? అని ప్రశ్నించారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చకుంటే రేవంత్ సర్కార్ ను బీసీ బిడ్డలు కూల్చడం ఖాయమని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.
కాగా, అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హామీ ఇచ్చారు. అంతేకాకుండా తన ట్రస్ట్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తానని బాధితులకు భరోసా కల్పించారు. నగరంలోని కోటగల్లీ మార్కెండేయ ఆలయ సమీపంలో మధిర ప్రసాద్, సుమలత నివసిస్తున్న ఇండ్లలో ఇంట్లో వెలిగించిన ద్వీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
విషయం తెలుసుకున్న అర్బన్ ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. తన ట్రస్ట్ ద్వారా స్వంతంగా బాధిత కుటుంబానికి రూ.25వేలు ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
More Stories
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులు!
నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు