
`బంగ్లా బంధు’ గా పేరొందిన బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ధన్మొండి 32 వద్ద ఉన్న చారిత్రాత్మక నివాసంపై హింసాత్మక గుంపు బుధవారం సాయంత్రం దాడి చేసింది. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, ఈ విధ్వంసకర దాడి ఆస్తిని తీవ్రంగా దెబ్బతీసింది. మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఆన్‌లైన్ ప్రసంగం తర్వాత ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై హసీనా స్పందింస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు భవనాన్ని కూల్చివేయవచ్చు, కానీ చరిత్రను కాదని గుర్తించుకోవాలని పేర్కొన్నారు.
ఇది ప్రతీకారంగా బుల్డోజర్ మార్చ్ నిర్వహించాలని గతంలో ప్రకటించిన నిరసనకారులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రారంభంలో, ప్రదర్శనకారులు రాత్రి 9 గంటలకు (స్థానిక సమయం) ఇంటిని కూల్చివేస్తామని బెదిరించారు, కానీ ఒక గంట ముందుగానే వచ్చి బలవంతంగా గేటును పగలగొట్టి లోపలికి దూసుకెళ్లారు
లోపలకు ప్రవేశించిన తర్వాత, నిరసనకారులు షేక్ హసీనాకు. వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు. ఆ ఇంటిని “నిరంకుశత్వం, ఫాసిజం”ల చిహ్నంగా ప్రకటిస్తూ, వారు “ముజిబిజం” అని పిలిచే దాని జాడలను తొలగించాలని ప్రతిజ్ఞ చేశారు. కొంతమంది నిరసనకారులు షేక్ హసీనాను ఉరితీయాలని కూడా పిలుపునిచ్చారు.
ఉద్రిక్తతలు పెరగడంతో, అల్లరిమూకలు రెండవ అంతస్తుకు ఎక్కి షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రపటాలను పగులగొట్టడానికి సుత్తులు, కర్రలు, చెక్క పలకలను ఉపయోగించి ఇంటిలోని వివిధ భాగాలను ధ్వంసం చేశాయి. హింసాత్మక దాడి చారిత్రాత్మక ఆస్తిని శిథిలావస్థకు చేర్చింది. పగిలిపోయిన ఫ్రేములు, విరిగిన ఫర్నిచర్, వికృతమైన గోడలు విధ్వంసానికి సాక్ష్యంగా నిలిచాయి,.
ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం ధన్మొండి 32 నివాసంపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదని ఇక్కడ గమనించాలి. గత సంవత్సరం ఆగస్టు 5న అవామి లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ఆగ్రహంతో ఉన్న ఒక గుంపు గతంలో ఇంటిని లక్ష్యంగా చేసుకుని, దాని భాగాలకు నిప్పంటించి, విస్తృతమైన నష్టాన్ని కలిగించింది.
ఈ మైలురాయి ఆస్తిపై తాజా దాడి బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న అశాంతి, లోతైన రాజకీయ విభజనలను వివరిస్తుంది. నష్టం ఎంతవరకు జరిగిందో లేదా దాడికి ప్రతిస్పందనగా ఏవైనా తక్షణ భద్రతా చర్యలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఇలా ఉండగా, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో సహా ఐసిటి కోరుతున్న వ్యక్తులపై ఇంటర్‌పోల్ త్వరలో నోటీసు జారీ చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు బంగ్లాదేశ్ ఉన్నత పోలీసు అధికారి బహరుల్ ఆలం తెలిపారు.
ఇంతలో, బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం ‘బలవంతంగా అదృశ్యం’, ‘జూలై హత్యలు’లో పాల్గొన్నారనే ఆరోపణలపై హసీనా, 96 మంది ఇతరుల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసింది. ఆమెను విచారణకు హాజరుపరచాలని బంగ్లాదేశ్ అధికారికంగా కోరుతుంది.
More Stories
విద్యాశాఖను మూసివేసిన ట్రంప్
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష?
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడి…85 మంది మృతి