
రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వ యంతో విభజనకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించు వాలని ఇటీవల కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఎఎస్ అధికారి గోవింద్ మోహన్ హితవు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వాలు సానుకూల దృక్పథంతో ఉన్నందున ఇప్పుడే సమస్యలు కూడా త్వరగా పరిష్కారం చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి ఏపీ విభజన అంశాలపై దిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఆయన సోమవారం తొలిసారి సమీక్షాసమావేశం జరిపారు. ఈ సమా వేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీలు శాంతికుమారి, విజయానంద్‌లతో పాటు ఇరు రా ష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని ప్రధానాంశాలపై అ ధికారులు చర్చించారు.
తమకే ఎక్కువ రావాలని ఇద్దరూ పట్టుపడితే, ఇద్దరికీ నష్టం వస్తుందని హితవు పలికినట్లు సమాచారం. ఒకరి అభిప్రాయం మరొకరు కాదని కోర్టుకు వెళితే, కేంద్రంగా తాము ఏమీ చేయలేమని, ఎప్పటికి తేలుతుందో కూడా చెప్పలేని పరిస్థితి రావొచ్చని హోంశాఖ కార్యదర్శి హెచ్చరించినట్లు తెలుస్తున్నది.
విదేశీ సంస్థల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పుల వ్యవహారంలో న్యాయ సలహా ప్రకారం వెళ్లాలని హోంశాఖ కార్యదర్శి సూచించారు. దీనికి ఇరు రాష్ట్రాలు తమ అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయం తీసుకుంటామని చెప్పగా, త్వరగా తీసుకోవాలని హోం కార్యదర్శి చెప్పినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల ఎజిలు చెప్పే అభిప్రాయానికి అనుగుణంగా తదుపరి భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
విభజన, ఆస్తులు, అప్పుల పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలకు హోం కార్యదర్శి కీలక సూచనలు చేసినట్లు సమాచారం. 20 సంస్థలకు సంబంధించిన నిధుల పంపకాల్లో ఉన్న సమస్యల పై ఇరువురు సానుకూల దృక్పదంతో ఉండాలని కేంద్ర హోం కార్యదర్శి తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారుల స్థాయిలోనే అవకాశం ఉన్నంత వరకు పరిష్కారానికి ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వాధినేతలతో చర్చించి కొలిక్కి తీసుకురావాలని సూచించారు.
20 సంస్థలకు సంబంధించిన నిధుల పంపకాల్లో ఉన్న సమస్యలపై ఇరువురు సానుకూల దృక్పదంతో ఉండాలని కేంద్ర హోం కార్యదర్శి తెలిపారు. రెండు రాష్ట్రాల్లో మౌలిక వసతుల ప్రాజక్టులకు కేంద్రం పూర్తి మద్దతు ఉంటుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ స్పష్టం చేసినట్లు సమాచారం.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
మూడురోజుల పాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్పో