కిషన్ రెడ్డి ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి ధన్కర్

కిషన్ రెడ్డి ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి ధన్కర్

బొగ్గు, గనుల రంగంలో చేసిన కీలక ఆవిష్కరణలకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి  ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అభినందనలు తెలిపారు. ఆయన కిషన్ రెడ్డికి మరింత పారదర్శకత , సామర్థ్యాన్ని పెంచే విధంగా పనిచేసినందుకు ప్రశంసలు జేసారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి ప్రారంభించిన “సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్”ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ వినూత్న వ్యవస్థ అనుమతుల ప్రొసెస్‌ను సులభతరం చేస్తుంది. రాజ్యసభలో జరిగిన ఒక ప్రశ్నోత్తర సమయంలో కిషన్ రెడ్డి, బొగ్గు రంగంలో డిజిటలైజేషన్ ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగినట్టు వివరించారు. ఈ డిజిటల్ పరివర్తన వల్ల మొత్తం మైనింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుంది. తగిన అన్ని మాడ్యూల్స్ విజయవంతంగా ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. 

కిషన్ రెడ్డి 2015లో ప్రవేశపెట్టిన వేలం విధానంలో పెరిగిన పారదర్శకతపై ప్రత్యేకంగా చెప్పారు. ఇప్పుడు “సింగిల్ విండో” వ్యవస్థ ద్వారా ఈ పారదర్శకత మరింత పెరిగింది. ఈ మార్పును అమలు చేయడంలో ప్రభుత్వం అతి వేగంగా అడుగులు వేస్తుందని హామీ ఇచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.

2014 కంటే ముందు బొగ్గు బ్లాకులు అనేక అన్యాయంగా కేటాయించబడ్డాయని, అందుకు గల కారణం కోల్‌గేట్ కుంభకోణం అని తెలిపారు. కానీ వేలం విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఎలాంటి అన్యాయం జరగకుండా, పారదర్శకత కొనసాగిస్తున్నారని చెప్పారు. దానితో ఉపరాష్ట్రపతి “ఈ రంగంలో మీరు చేసిన పని అద్భుతం” అని కొనియాడారు.

 “సింగిల్ విండో వ్యవస్థ గొప్పది. గనులు మన సహజ సంపద మంత్రిని అభినందిస్తున్నాను” అని కూడా వ్యాఖ్యానించారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తన ట్వీట్‌లో కూడా “సింగిల్ విండో సిస్టమ్ పై తాము ఇచ్చిన ప్రశంసలకు ధన్యవాదాలు” అని తెలిపారు.