ఇంగ్లండ్‌పై భారత్‌ ఘనవిజయం

ఇంగ్లండ్‌పై భారత్‌ ఘనవిజయం
 
* అభిషేక్‌ 37 బంతుల్లో సెంచరీతో విశ్వరూపం
అభిషేక్ శర్మ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను షేక్ చేస్తే, భారత బౌలర్లు బాలత్‌తో ఆతిధ్య బ్యాటర్లను వణికించారు. దీంతో చివరి వన్డేలో భారత్ భారీ విజయం సాధించింది. 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.  ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత్‌ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
లుత ఓపెనర్‌ అభిషేక్‌శర్మ(54 బంతుల్లో 135, 7ఫోర్లు, 13సిక్స్‌లు) ధనాధన్‌ సెంచరీతో టీమ్‌ ఇండియా 20 ఓవర్లలో 247/9 స్కోరు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ అభిషేక్‌ సునామీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. శివమ్‌దూబే(30), తిలక్‌వర్మ(24) ఆకట్టుకున్నారు. కార్స్‌(3/38), మార్క్‌వుడ్‌(2/32) రాణించారు. భారీ లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్‌ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. షమీ అభిషేక్‌ దూబే వరుణ్‌ ధాటికి ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. 

సాల్ట్‌(55) మినహా అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సూపర్‌ సెంచరీతో అదరగొట్టిన అభిషేక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, 14 వికెట్లు పడగొట్టిన వరుణ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’దక్కాయి. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మెరుగైన శుభారంభం దక్కింది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న ఓపెనర్‌ శాంసన్‌(16) మరోమారు నిరాశపరిచాడు. 

అయితే అభిషేక్‌ తన మెంటార్‌ యువరాజ్‌సింగ్‌ శైలిని పుణికిపుచ్చుకున్న ఈ పంజాబీ బ్యాటర్‌ ఇంగ్లండ్‌ బౌలర్లను దునుమాడాడు. మొదట సింగిల్స్‌కే మొగ్గుచూపిన శర్మ ఆ తర్వాత బౌండరీలతో చెలరేగాడు. ఆర్చర్‌ వేసిన 3వ ఓవర్‌లో మొదలైన ఈ చిచ్చరపిడుగు జోరు ఆఖరి దాకా కొనసాగింది.  ఆర్చర్‌ను ఓ ఫోర్‌, రెండు సిక్స్‌లు అరుసుకున్న అభిషేక్‌ ఆ తర్వాత వుడ్‌, ఓవర్టన్‌ పనిపట్టాడు. ఈ క్రమంలో 17 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్‌ అందుకున్నాడు. మరో ఎండ్‌లో తిలక్‌ జత కలువడంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్‌ 95 పరుగులు చేసింది. 

ఓవైపు తిలక్‌ ఔటైనా అభిషేక్‌ జోరు ఏమాత్రం తగ్గలేదు. బౌలర్‌తో సంబంధం లేకుండా బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న శర్మ  37 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు.  7 అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అభిషేక్‌శర్మ(135)ది అత్యుత్తమ స్కోరు. గిల్‌(126*) రికార్డును అభిషేక్‌ దాటేశాడు.

టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరే రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. 37 బంతుల్లో 270 స్ట్రైక్ రేట్‌తో 13 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో సెంచరీ బా దాడు. టీ20ల్లో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20ల్లో టీమిండియా తరఫున మొదటి ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును రోహిత్ శర్మ నమోదు చేశాడు. అతడు 35 బంతుల్లోనే శతకొట్టాడు. 2017లో శ్రీలంకపై ఈ ఫీట్ నమోదు చేశాడు.