
దీన్ని గ్రేట్ ప్లానెటరీ అలైన్‌మెంట్‌గా పిలుస్తారు. ఈ ఖగోళవిందును టెలిస్కోప్ సహాయం లేకుండా చూడొచ్చు. కానీ, స్పష్టంగా నాలుగు గ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూసేందుకు టెలిస్కోప్ అవసరమవుతుంది. సూర్యాస్తమయం తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది.
ఆ సమయంలోనే అన్ని గ్రహాలు ఒకే వరుసలో దర్శనమిస్తాయి. రాత్రి 11.30 గంటల తర్వాత మళ్లీ కనిపించవు. కానీ, బృహస్పతి, మార్స్, యురేనస్ గ్రహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్లీ కనిపించకుండా పోతాయి. ఈ నెల 22 నుంచి 31 వరకు ఆయా గ్రహాలను భూమిపై నుంచి నేరుగా చూడొచ్చు.
శని, బుధుడు, నెప్ట్యూన్ సూర్యాస్తమయం సమయంలో సూర్యుడికి దగ్గరగా వెళ్తాయి. మెర్క్యురీ, శని, నెప్ట్యూన్ సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్లడంతో గ్రహాలు భూమిపైకి కనిపించడం తగ్గిపోతుంది. శుక్ర గ్రహం సైతం అంతగా కనిపించేందుకు ఛాన్స్ ఉండదు. బృహస్పతి, అంగారకుడు, యురేనస్ సైతం మాత్రమే కొద్దివారాల పాటు అలాగే ఉంటాయి.
ఈ అరుదైన దృశ్యాన్ని అమెరికా, మెక్సికో, కెనడా, భారత్‌లో చూసేందుకు అవకాశం ఉంది. జనవరి 22 నుంచి 31 వరకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. ఆయా గ్రహాలను చూసేందుకు వీలైనంత వరకు ఎక్కువగా చీకటిగా ఉండే ప్రాంతాలకు వెళ్లడం మంచిది. ఎందుకంటే లైట్ల వెలుతురులో అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. అందుబాటులో టెలిస్కోప్ ఉంటే గ్రహాలను మరింత స్పష్టంగా తిలకించేందుకు అవకాశం ఉంటుంది.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!