క్షమాపణలు చెప్పిన వేణు స్వామి

క్షమాపణలు చెప్పిన వేణు స్వామి
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. గతంలో నటీనటుల వ్యక్తిగత జీవితాలపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానంటూ క్షమాపణలు చెప్పారు. నాగచైతన్య – శోభిత జంట పెళ్లి సమయంలో వేణుస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ వ్యా్ఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. అయితే, నోటీసులను సవాల్‌ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్‌ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో వేణుస్వామి మహిళా కమిషన్‌ కార్యాలయానికి వచ్చి క్షమాపణలు లిఖితపూర్వకంగా తెలిపారు. 
 
నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ జంట ఎక్కువ కాలం కలిసి ఉండరని, విడాకులు తీసుకుంటారని జోష్యం చెప్పారు వేణుస్వామి. వేణుస్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. 
 
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కమిషన్‌ ఎదుట హాజరైన వ్యాఖ్యలను కి తీసుకుంటున్న్లు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కమిషన్‌ హెచ్చరించింది. గతంలో నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారని అంటూ చెప్పిన జ్యోతిష్యం నిజం కావడంతో పలువురు సినీ నటులు, రాజకీయ నేతల జ్యోతిషాలు బహిరంగంగా చెబుతూ సంచలనం కలిగిస్తూ వివాదాస్పదంగా మారారు. ఈ విషయమై పలు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.