
డిజైన్లను ఆమోదించే సమయంలో నిబంధనలు పాటించలేదని కమిషన్ ప్రశ్నించగా.. ప్రాజెక్టు నిర్మాణ విషయంలో కోర్ కమిటీతో ఎప్పుడూ సమావేశం కాలేదని, కమిటీ రికార్డులు లేవని కమిషన్ ముందు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు చెప్పారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ విచారణకు మంగళవారం హారాజైన ఆయన 24 ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
రామకృష్ణారావు సమర్పించిన అఫిడవిట్, కాగ్ నివేదిక ఆధారంగా ఆయనను ముందు ప్రశ్నలు ఉంచారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, లోన్స్, ప్రాజెక్టు డిజైనులు, బడ్జెట్ కేటాయింపు, వడ్డీల చెల్లింపులపై వంటి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌కు నిధులు ఎలా వచ్చాయని కమిషన్ ప్రశ్నించింది. బడ్జెట్ కేటాయింపులు, లోన్స్ ద్వారా నిధులు సమకూర్చినట్లు రామకృష్ణారావు సమాధానం ఇచ్చారు.
కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తారన్న కమిషన్ ప్రశ్నకు.. పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నీళ్లు అమ్మి రెవెన్యూ జనరేట్ చేడమే ప్రాజెక్ట్ లక్ష్మని రామకృష్ణ చెప్పినట్లు సమాచారం. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని రామకృష్ణను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రాజెక్ట్ తొందరగా కట్టారు కానీ నిబంధనలు పాటించలేదని కమిషన్ అడిగింది. అలాగే అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పాలసీస్ పెట్టారా? అని కమిషన్ ప్రశ్నించగా దానికి రామకృష్ణారావు తెలియదని సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ ప్రాపర్‌గా కేబినెట్ ముందుకు రాలేదని, నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని కమిషన్ అడిగింది.
నిబంధనలు పాటించకుండా విడుదల చేసిన నిధుల రికార్డులను రామకృష్ణారావుకు కమిషన్ చూపించింది. ఆర్థిక పరమైన అంశాల్లో రికార్డులను సరిగా మెయింటెయిన్ చేయలేదని కమిషన్ ప్రశ్నించగా, ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గ్యారెంటీతోనే కార్పొరేషన్ లోన్స్ తీసుకుందని రామకృష్ణ తెలిపారు. 2024- 25 ఫైనాన్షియల్ ఇయర్లో రూ.7382 ప్రిన్సిపల్ అమౌంట్‌కు రూ.6519 కోట్ల వడ్డీ చెల్లించామని ఆయన వెల్లడించారు. 9 నుంచి 10.5 శాతం వడ్డీ చెల్లిస్తున్నామని కమిషన్‌కు రామకృష్ణా రావు తెలిపారు.
More Stories
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!
చార్ ధామ్ యాత్రకు ప్రత్యేకంగా భారత్ గౌరవ్ రైళ్లు
అధికారులు ఏసీ గదుల నుంచి బైటకు రావట్లేదు