కేంద్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు సంబంధించి రూ 7,597.16 కోట్ల వ్యయ అంచనాలతో మొత్తం 190 కిలోమీటర్ల మేర రెండు జాతీయ రహదారుల పనులకు ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిపిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ నిర్ణయమే మరొక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
మొదటిది ఎన్‌హెచ్ 63పరిధిలోని ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల సెక్షన్ రాదారి విస్తరణ హైబ్రిడ్ అన్యూటి మాడల్ (హామ్) పద్థతిలో నిర్మిస్తారు. ఇక రెండోది ఎన్‌హెచ్ 563 సంబంధిత జగిత్యాల కరీంనగర్ సెక్షన్ రహదారి బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్‌ఫర్ ప్రాతిదికన కాంట్రాక్టుకు ఇస్తారు. నాలుగు లేన్ల ప్రామాణిక మార్గంగా దీనిని మారుస్తారు.
ఈ రహదార్ల ఏర్పాటు క్రమంలో మునుపటి ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా, కొంత మేరకు నిజామాబాద్ జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ప్రతిపాదించిన ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల ప్రాజెక్టు సెక్షన్ నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల మీదుగా సాగుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో హై వే వెంబడి విస్తృత జనసంచారం, రద్ది వ్యాపార సముదాయాలు ప్రాంతాలు ఉండటంతో ఇరుకైన దారిలో సాగాల్సి వస్తుంది.
ఈ మార్గంలో అంకుశాపూర్, కోరుట్ల, ధర్మపురి, లక్సేటిపేట, మంచిర్యాల, జగిత్యాల్ వంటి ప్రాంతాలు ఉండటంతో ప్రయాణ ఇక్కట్లు తలెత్తతున్నాయి. ఇదే విధంగా జగిత్యాల కరీంనగర్ సెక్షన్ కూడా పలు రద్దీ ప్రాంతాల మీదుగా వెళ్లుతుంది. జగిత్యాల, పోతారం, గంగాధర, కరీంనగర్ లలో ఇటీవలి కాలంలో విపరీత స్థాయిలో ప్రయాణాలు సాగుతున్నాయి. ఈ డిమాండ్‌ను ఇప్పటి రోడ్లు సరైన విధంగా తీర్చలేకపోతున్నాయి.
పూర్తి స్థాయి సమీక్షలు విశ్లేషణల తరువాత ఈ రెండు సెక్షన్ల విస్తరణ, నాలుగు లేన్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ మార్గంలో మహారాష్ట్ర , గుజరాత్ వంటి దూర ప్రాంతాలకు వేగంగా వెళ్లేందుకు వీలేర్పడుతుంది. ప్రయాణ సమయం గంటన్నర దాకా కుదింపు ఈ ప్రాజెక్టులు రెండు సంపూర్తి అయితే ఈ ప్రాంతాల్లో వారికి రవాణా సమయం దాదాపుగా గంటన్నర వరకూ ఆదా అవుతుంది.
ఆర్మూర్, మంచిర్యాల మధ్య వెళ్లే వారికి గంటన్నర కలిసి వస్తుంది. జగిత్యాల, కరీంనగర్ మధ్య వెళ్లే వారికి దాదాపు ముప్పావు గంట ప్రయాణ సమయం తగ్గుతుంది. ఎక్కువగా రవాణా సౌకర్యాలు ఏర్పడటంతో పాటు వ్యాపార రంగం వృద్థికి వీలేర్పడుతుందని ఆశిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘పీఎం గతిశక్తి’ సూత్రాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ రహదారులు వరంగల్, సిద్దిపేట ఎస్ఈజెడ్ లు, నిజామాబాద్ మెగా ఫుడ్ పార్క్ వంటి 5 ఆర్థిక కేంద్రాలను, వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం వంటి 7 ప్రముఖ పుణ్యక్షేత్రాలను మరియు వివిధ రైల్వే స్టేషన్లతో కూడిన 10 లాజిస్టిక్స్ కేంద్రాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తాయి.
దీనివల్ల సరుకు రవాణా వేగవంతమై దేశ లాజిస్టిక్స్ పనితీరు మెరుగుపడటమే కాకుండా, స్థానికంగా సుమారు 77 లక్షల రోజులకు సరిపడా పనిదినాల మ్యాన్ – డేస్ (మనుషుల రోజువారీ కూలి) రూపంలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించి, తెలంగాణ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

More Stories
కోల్‌కతా కాలేజీ గదుల్లో రూ 1 కోటి నగదు, గన్, బెడ్స్, కండోమ్స్
రెబల్ టిఎంసి ఎమ్మెల్యేను ప్రతిపక్ష నేతగా గుర్తించిన స్పీకర్
ఎసిబి సోదాల్లో అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్ట్