మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా

మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా

మహాకుంభమేళలో పూసలమ్ముకొనే ఒక యువతి సంచలనంగా మారింది. కాటుక పెట్టిన తేనె కళ్లు, డస్కీ స్కీన్, అందమైన చిరునవ్వుతో ఆ అమ్మాయి మహాకుంభమేళాను ఆకట్టుకుంది. ఆమె అందంతో మంత్రముగ్దమైన ప్రజలు, ఇప్పుడు ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయ్యింది. 

ఆమె పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. తల్లిదండ్రులకు సాయంగా మోనాలిసా కూడా చిన్నతనం నుంచే పూసల దండలు అమ్ముతున్నది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భంగా పూసల దండలు అమ్ముకోవడానికి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చింది.

అక్కడే మోనాలిసా అమాయకపు మొహం, కాటుక దిద్దిన తేనె కాళ్లు చూసి కొంతమందికి ముచ్చటేసింది. దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆ ఫొటోలు చూసిన వారు కూడా మోనాలిసా అందానికి ఫిదా అయ్యారు.

మోనాలిసాతో సెల్ఫీలు దిగే, ఆమెను ొటోలు, వీడియోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు, వ్లాగర్లు ఎగబడుతున్నారు. ఆమె అందాన్ని పొగిడేస్తూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలా మొత్తమ్మీద మోనాలిసా ఇప్పుడు సెన్సేషన్‌గా మారడంతో బాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రా తన సినిమాలో మోనాలిసాకు ఛాన్స్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం.

మోనాలిసా రూపం, ఆమె అమాయకత్వాన్ని చూసి ఫిదా అయ్యానని సనోజ్‌ మిశ్రా తెలిపారు. డైరీ ఆఫ్‌ మణిపూర్‌ చిత్రంలో ఆమెకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని, తన సినిమాలో రైతు కూతురి పాత్రలో నటించేందుకు మోనాలిసా సరిగ్గా సెట్‌ అవుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  తొందరలోనే ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి మోనాలిసాను కలుస్తానని చెప్పారు. ఆమెకు యాక్టింగ్‌ నేర్పించి మరి తన సినిమాలోకి తీసుకుంటానని స్పష్టం చేశారు.