
* పీపుల్స్ పల్స్ సిఫార్సులు
ఏపీ వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం జరిపిన పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ వీటి వల్లన పలువురు ప్రయోజనం పొందుతున్నారని, వీటిని కొనసాగించాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే, ఓ ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వీటి పర్యవేక్షణను పటిష్ట పరచాలని సూచించింది.
ఈ పథకాన్ని నిరుద్యోగ యువత దాదాపు 38 శాతం మంది వినియోగించుకుంటున్నారు. వీరిలో చాలామంది పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్నవారు, లైబ్రరీల్లో చదువుకుంటున్నవారు, పబ్లిక్వెల్ఫేర్ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులు ఇందులో ఉన్నారు. అన్న క్యాంటీన్లకు ఆదివారం సెలవు తీసివేయాలని కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులు, లైబ్రరీల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఈ సందర్భంగా కోరారు.
అన్న క్యాంటీన్లో తినడం వల్ల తమ సేవింగ్స్ పెిగాయన, ఆరోగ్యం కూడా బాగుంటుందని 45 శాతం మంది చెప్పారు. అన్న క్యాంటీన్లు వచ్చిన తర్వాత సోమరిపోతులుగా మారుతున్నారని, పని చేయడం మానేశారనేది కేవలం అపోహా మాత్రమే అని స్పష్టమైంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసినప్పుడు అక్కడ ఆహారం తీసుకుంటున్న 68 శాతం మంది తాము చేస్తున్న పనుల గురించి
అయితే, వీరితో పంచుకున్నారు. వైన్ షాపుల్లో మందుకు ఎక్కువ ఖర్చు పెట్టి, తక్కువ డబ్బులకు అన్న క్యాంటీన్లలో భోజనం చేస్తున్న వారు కూడా ఉన్నారనేది వాస్తవం. క్యాంటీన్లు మళ్లీ తెరవడంపై 75 శాతం మంది సంతోషం వ్యక్తం చేశారు. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ క్షేత్రస్థాయిలో అన్న క్యాంటీన్లపై నిర్వహించిన సర్వేలో సేకరించిన ప్రజాభిప్రాయం ప్రకారం ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటే అన్న క్యాంటీన్లను మరింత పటిష్టంగా నిర్వహించడంతో పాటు ప్రజల మనసు కూడా గెలుచుకోవచ్చని సూచించింది.
* అన్న క్యాంటీన్ల పర్యవేక్షణ, వాటి నిర్వాహణ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక ప్రత్యేక అధికారి నియామకంతో పాటు, ఈ కార్పొరేషన్ బాధ్యతలను ఒక ప్రజాప్రతినిధికి లేదా సమర్థతగల నాయకుడికి అప్పగించాలి. ఈ కార్పోరేషన్లో కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, సంఘ సేవకులను కూడా డైరెక్టర్లుగా నియమించి, వీటి నిర్వాహణ బాధ్యతను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.
* అన్న క్యాంటీన్లలో భోజనం చేస్తున్నవారు 5 రూపాయిలకే భోజనం వస్తుందని, 5 రూపాయిలకు ఇంతకంటే ఎక్కువేం పెడతారు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. వాస్తవానికి మూడు పూటలకు లబ్దిదారులు 15 రూపాయిలే చెల్లిస్తున్నా ప్రభుత్వం మరో 75 రూపాయిలు చెల్లిస్తున్న విషయాన్ని లబ్దిదారులకు, ప్రజలకు తెలియజేయాలి. ఈ విషయాన్ని ప్రచారం చేసుకుంటే, ప్రభుత్వానికే మంచిది. 5 రూపాయిల భోజనం అని చిన్నచూపు చూసేవారికి కూడా విలువ తెలుస్తుంది. ఈ పథకానికి ఖర్చు చేస్తున్న రూ.200 కోట్ల నిధుల వినియోగాన్ని, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలి. అసలు ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తున్న విషయం ప్రజా ప్రతినిధులకు కూడా తెలియదన్న విషయం ఈ ఆధ్యయనంలో తేలింది.
* అన్న క్యాంటీన్లలో భోజనం నాణ్యత విషయంలో 2019 నుంచి 2024 వరకు టీడీపీ నాయకులు నడిపిన ప్రయివేట్ అన్న క్యాంటీన్లలో పెట్టిన భోజనంతో పోల్చుకుంటున్నారు. నాయకులు నడిపిన క్యాంటీన్లలో పెట్టినట్టు ఆహార పదార్థాలు పెట్టాలని కోరుతున్నారు. రూ.20కే బయట బండి కొట్ల వద్ద 5 ఇడ్లీలు లేదా మంచి టిఫిన్ ఇస్తున్నప్పుడు, ప్రభుత్వం ఇస్తున్న రూ.22తో ఇంకా మంచి టిఫిన్ అందించవచ్చు. అక్షయపాత్ర మంచి సంస్థ. వారి నుంచి ఇంతకంటే మెరుగైన ఆహారం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కర్రీలు, అల్పాహారం వండే విధానం మారుస్తూ ఉండాలి.
*ఒకేరుచిలో కాకుండా వేపుడు కూరలు, వెజిటేబుల్ కర్రీలు ఇస్తే బాగుంటుంది. స్పైసీగా ఉండాలని, వేడిగా ఆహారాన్ని అందించేలా అన్ని చోట్ల హాట్ బాక్సుల్లో అందించాలని కోరుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మంచింది. ఇలా చేయడం వల్ల లబ్దిదారుల్లో ఆసక్తి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం ఉద్దేశించిన పోషకాహార లక్ష్యం కూడా నెరవేరుతుంది.
*అక్షయపాత్ర వారు ప్రస్తుతం అన్న క్యాంటీన్లతో పాటు మధ్యాహ్న భోజన పథకానికి కూడా వారే ఆహారం అందజేస్తున్నారు. ప్రస్తుతం అక్షయపాత్ర కిచెన్లు ఉమ్మడి జిల్లాకు ఒకటి లేదా రెండు జిల్లాలకు ఒకటి ఉంటున్నాయి. దీనివల్ల దూర ప్రాంతాలకు ఆహారం వెళ్లేసరికి చల్లబడి నాణ్యత తగ్గుతోంది. దీనిని దృష్టి లో ఉంచుకుని మరిన్ని కిచెన్లు పెంచాలని ప్రభుత్వం అక్షయపాత్ర సంస్థకు సూచించాలి.
*అన్న క్యాంటీన్లలో పని చేస్తున్న సిబ్బంది దురుసు ప్రవర్తన విషయంలో లబ్దిదారుల్లో ఉన్న అసంతృప్తిని నివారించడానికి ఓపికతో వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ ఇప్పించాలి. సిబ్బంది ప్రవర్తనను స్థానిక అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించి, అవసరమైన చోట కఠిన చర్యలు తీసుకోవాలి. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి. సిబ్బందికి ప్రత్యేకంగా డ్రెస్కోడ్ పెట్టాలి. లబ్దిదారులకు ఇవ్వాల్సిన క్వాంటిటీ ఇవ్వకుండా చేతివాటం చూపిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
* ఈ సర్వే ప్రకారం అన్న క్యాంటీన్లకు అందాల్సిన ఆహార పదార్థాలు రోజుకో సమయానికి అందుతున్నాయి. దీని వల్ల క్యాంటీన్ నిర్వాహణలో ఇబ్బందులు ఎదరవుతున్నాయి. కిచెన్లో ఏ సమయానికి ఆహారం సరఫరా చేసే వాహనాలు ప్రారంభమయ్యాయి? క్యాంటీన్కి ఎప్పుడు ఆహార పదార్థాలు అందించాయి? అనే విషయాన రోజూ లాగ్ బక్లో మోదు చేయాలి. వీటిని ధికార యంత్రాంగం ఎప్పటికప్పుడూ పర్యవేక్షించాలి.
*ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి క్వాంటిటీలో ఆహార పదార్థాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలి. చాలాచోట్ల 400 గ్రాములు ఇవ్వాల్సిన రైస్, 350 గ్రాముల రైస్ ఇస్తున్నట్లు అనేక చోట్ల ఫిర్యాదులు వచ్చాయి.
* తాగునీటి సౌకర్యం, శుభ్రత విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలి. ప్లేట్లను శుభ్రంగా కడిగేలా సిబ్బందికి సూచించాలి. టేబుల్స్ని కూడా వెంటవెంటనే శుభ్రం చేయించాలి. శుభ్రతకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
*ప్రతి క్యాంటీన్లో తగినంత 5 రూపాయిల కాయిన్స్ అందుబాటులో ఉండడం లేదు. పేదవారికి యూపీఐ చేసే స్తోమత కూడా లేకపోవడంతో చిల్లర సమస్య తలనొప్పిగా మారింది. చిల్లర సమస్యను నివారించడానికి ప్రతి క్యాంటీన్లో తగినన్ని 5 రూపాయిల కాయిన్స్ అందుబాటులో ఉంచాలి.
*టోకెన్ సిస్టమ్ దాదాపు 40 శాతం క్యాంటీన్లలో అమలు కావడం లేదు. సిబ్బంది డబ్బులు తీసుకుని, ఆహార పదార్థాలు అందిస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం… సిస్టమ్స్పని చేయకపోవడం. టోకెన్లు ఇవ్వకపోవడం వల్ల సిబ్బంది చేతివాటం పెరిగింది.
*అన్న క్యాంటీన్లలో చాలాచోట్ల సీసీ కెమెరాలు పని చేయడం లేదు. వీటిని వెంటనే మరమ్మత్తులు చేసి, సెంట్రలైజ్డ్గా పర్యవేక్షించాలి.
*ఆహార పదార్థాల నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, శుభ్రత తదితర విషయాలపై ఫిర్యాదు చేయడానికి ఒక వ్యవస్థ లేకపోవడం కూడా లోపంగానే చూడాలి. లోటుపాట్లు తెలుసుకోవడానికి ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన క్యూ ఆర్ స్కాన్ సులభంగా ఉపయోగించలేపోతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నవారు తక్కువమంది ఉండటం, దీనిపై సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలు. దీనికి బదులుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ గానీ, సలహాల బాక్స్ గానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
*మహిళల కోసం ప్రత్యేకంగా అన్న క్యాంటీన్ ని ప్రయోగాత్మక ప్రారంభించి, వీటిని మహిళా సంఘాలకు అప్పగిస్తే బాగుంటుంది. దీంతో పేద మహిళలకు పోషకాహారం అందడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కూడా లభిస్తుంది.
* అన్న క్యాంటీన్లు పట్టణ ప్రాంతాలు, నియోజకవర్గాల కేంద్రాలకే పరిమితం చేయకుండా, వీటిని విడతల వారీగా మండల కేంద్రాలకు విస్తరించాలి.
* అన్న క్యాంటీన్ల నిర్వాహణ వీలైనంత ఎక్కువమంది దాతలను భాగస్వామ్యం చేయాలి. ఒక అన్నక్యాంటీన్లో ఒక రోజూ మొత్తం నిర్వహించడానికి సుమారు రూ. 26,000 ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును అందించిన దాతలు ౌరవంగా కయాంటీన్లో ఒక డిస్ ప్లే బోర్డ్, వారి వివరాలు నమోదుచేయాలి. దీని కోసం స్థానిక నాయకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. దీని వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గడంతో పాటు మరిన్ని ప్రాంతాలకు క్యాంటీన్లను విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
* చాలాచోట్ల ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మద్యం సేవించి వస్తుండటంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతోంది. దీని నివారణకు ప్రతి అన్న క్యాంటీన్ వద్ద లోకల్ పోలీస్ లేదా సచివాలయం సిబ్బంది డ్యూటీ చేస్తే, క్యాంటీన్ నిర్వాహణ సాఫీగా సాగుతుంది.
*అన్న క్యాంటీన్లలో అందించే అల్పాహారం మెనూలో అప్పుడప్పుడు పులిహోరా, టమోటా రైస్, కిచిడి, వెజ్ బిర్యానీ వంటి రైస్ ఐటమ్లు కూడా ఉంటే బాగుంటుందని అనేక మంది అభిప్రాయపడ్డారు.
*ముఖ్యమంత్రి మొదలుకొని దిగువ స్థాయి ప్రజా ప్రతినిధుల వరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి దిగువ సిబ్బంది వరకు కనీసం నెలలో ఒక్కసారైనా ఈ అన్న క్యాంటీన్లను ఆకస్మీకంగా తనిఖీ చేయడంతో పాటు భోజనం చేయడం వల్ల క్యాంటీన్ల మీద విశ్వసనీయత పెరుగుతుంది.
*ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో సహా అన్న క్యాంటీన్ల పనితీరుపై క్రమం తప్పకుండా సమీక్షించాలి. తద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు సాధించవచ్చు.
*అన్న క్యాంటిన్ల పర్యవేక్షణను ఆయా ప్రాంతాల్లోని సచివాలయాలకు అప్పగించాలి
-ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా క్రమం తప్పకుండా అన్న క్యాంటిన్లలో అందిస్తోన్న ఆహారాన్ని తనిఖీచేయాలి.
-ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా క్రమం తప్పకుండా అన్న క్యాంటిన్లలో అందిస్తోన్న ఆహారాన్ని తనిఖీచేయాలి.
*ప్రయోగాత్మకంగా కొన్ని క్యాంటిన్లను స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించి, వారు నడిపే తీరును పరిశీలించి భవిష్యత్తులో వారికి ఈ క్యాంటిన్లను అప్పగించేలా ప్రణాళికలు రూపొందించాలి.
*అన్న క్యాంటిన్లలో అందిస్తోన్న ఆహారం, దానికి ఖర్చు చేస్తున్న బడ్జెట్ తదితర అంశాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలి. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ఈ క్యాంటిన్లపై ప్రచారం విస్తృతంగా చేయాలి
*రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా పేదలకు ఆహారం అందిస్తోన్న అన్నా క్యాంటిన్లను తనిఖీ చేసి ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు ఇవ్వాలి. తద్వారా ఈ పథకం మరింత మెరుగ్గా అమలు చేసేందుకు వారి వంతు సహకారం అందించాలి.
*కార్పొరేట్ సంస్థలు వారి సిఎస్సార్ ఫండ్స్ ద్వారా అన్న క్యాంటిన్లకు సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి.
*రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు అన్న క్యాంటిన్లు ఆహార సరఫరా చేస్తున్న కిచెన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
*అనేక యూట్యూబ్ ఛానెళ్లు ఆహారం అందించే హోటళ్లపై వీడియోల చేస్తరు. అన్న క్యాంట్లపై ూడా ఆయా యూట్యూబ్ ఛానెళ్లు వీడియోలు చేసి వీటికి మరింత ప్రచారం కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
*2019 ఎన్నికల సందర్భంగా దేశంలోనే ప్రముఖ రీసెర్చి సంస్థ సిఎస్డిఎస్ -లోక్ నీతి నిర్వహించిన సర్వే ప్రకారం అన్న క్యాంటిన్ల వల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరిందని వెల్లడైంది.
*రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్న క్యాంటిన్ల పనితీరుపై ఐవిఆర్ఎస్ సర్వే నిర్వహించడమే కాకుండా ప్రముఖ రీసెర్చి సంస్థలతో ప్రతి ఆర్నెళ్లకోసారి థర్డ్ పార్టీ సర్వే నిర్వహించి వాటి పనితీరును మరింత మెరుగు పరచాలి.
*సెలెబ్రెటీలు కూడా అన్న క్యాంటిన్లను సందర్శించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
More Stories
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్
తెలంగాణాలో ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో!