
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పలు కీలక పత్రాలపై ఆయన సంతకం చేశారు. పలు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ, క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష వంటి ఆదేశాలు జారీ చేశారు. ఇక అమెరికా నేలపై జన్మించే వారికి హక్కుగా దక్కే పౌరసత్వానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వైట్‌హౌజ్ చేరుకున్న తర్వాత ఆయన పలు డాక్యుమెంట్లపై సంతకం చేశారు. దాంట్లో డబ్ల్యూహెచ్‌వో ఉపసంహరణ ఆదేశాలు కూడా ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకోవాలని ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం ఇది రెండోసారి.
కరోనా సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన రీతిలో వ్యవహరించలేదని గతంలో కూడా ట్రంప్ ఆరోపించారు. జెనీవాకు చెందిన ఆ సంస్థ సభ్యత్వం నుంచి వైదొలుగుతుట్లు తంలోన వెల్లడించారు. కానీ బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు.
కరోనాను నియంత్రించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని, చైనాలోని వుహాన్ నుంచి వ్యాపించిన ఆ వైరస్‌ను పసికట్టడంలో ఆ సంస్థ విఫలమైందని, అవసరమైన సంస్కరణలను చేపట్టలేకపోయిందని, సభ్య దేశాల నుంచి రాజకీయ ఐకమత్యాన్ని తీసుకురావడంలో అసమర్థంగా వ్యవహరించినట్లు ట్రంప్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
More Stories
ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై సౌదీ అరేబియాలో నేడే శాంతి చర్చలు
మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్ అరెస్ట్
అమెరికా సైన్యంలో దారి మళ్లిన ఆహార నిధులు