గాజాలో 19న మొదటి విడత బందీల విడుదల!

గాజాలో 19న మొదటి విడత బందీల విడుదల!

ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందం 19వ తేదీ నుండి అమల్లోకి రానుంది. అదే రోజు మొదటి విడత బందీలు విడుదలవుతారని భావిస్తున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు కార్యాలయం తెలిపింది.  గాజా నుండి వచ్చే బందీలకుసాదరంగా స్వాగతం పలకడానికి సనాుహాలు చేయాల్సిందిగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందానికి ఆదేశాలు జారీ చేసినట్లు నెతన్యాహు తెలిపారు.

ఒప్పందం కుదిరిన విషయాన్ని బందీల కుటుంబాలకుకూడా తెలియజేయాల్సిందిగా కోరినట్లు చెప్పారు.  ఈ ఒప్పందానికి ఇజ్రాయిల్‌ కేబినెట్‌ తుది ఆమోద ముద్ర లభించడానికి ముందు గంటల తరబడి అనిశ్చితి నెలకొంది. అనంతరం ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేస్తూ భద్రతా కేబినెట్‌, ప్రభుత్వం ఆమోదముద్ర వేశాయని, అంగీకరించిన ప్రకారం ఆదివారానికి మొదటి విడత బందీల విడుదల జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, కీలక మధ్యవర్తి కతార్‌ ప్రధాని ఒప్పందం కుదిరిందని ప్రకటించిన రుసటి రోజు ఒప్పందం అమలు పట్ల నెతన్యాహు పాలక సంకీర్ణంలో ఆందోళనలు తలెత్తాయి. ఈ ఒప్పందానిు ఆమోదిస్తే తాము రాజీనామా చేస్తామని ఇద్దరు మంత్రులు బెదిరించారు. దాంతో కేబినెట్‌ ఓటింగ్‌ ఆలస్యమైంది. 

కానీ, హమాస్‌తో చివరి నిముషంలో తలెత్తిన వివాదం వల్లనే కాల్పుల విరమణపై ఓటింగ్‌ జరపడంలో జాప్యం చేసినట్లు ఇజ్రాయిల్‌ వ్యాఖ్యానించింది. మధ్యవర్తులు ప్రకటించిన ఒప్పందానికి తాము కట్టుబడి వున్నామని హమాస్‌ సీనియర్‌ అధికారి ప్రకటించారు. హమాస్‌తో వివాదానికి సంబంధించి ఇజ్రాయిల్‌ ప్రభుత్వ ప్రతినిధి డేవిడ్‌ మెన్సర్‌

ఇదిలావుండగా, ఒప్పందం కుదిరిందని ప్రకటన వెలువడిన తర్వాత కూడా గాజాలో ఇజ్రాయిల్‌ ఉధృతంగా దాడులు, దురాగతాలు కొనసాగిస్తూనే ఉంది. తాజా దాడుల్లో 110 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వీరిలో 28మంది పిల్లలు, 31మంది మహిళలు వునాురు. గాజా నగరంతోపాటూ ఉత్తర సరిహద్దు పట్టణాల్లో జనం ఎక్కువగా వుండే ప్రాంతాలపైనే దాడులు జరుగుతున్నాయి.

ఇప్పటివరకు గాజాలో 46,788మంది మరణించగా, 1.10,453మంది గాయపడ్డారు. గత 15మాసాలుగా ఇజ్రాయిల్‌ భీకరంగా కొనసాగించిన దాడుల్లో రోజుకు కనీసం 15మంది చొప్పున పిల్లలు గాయపడ్డారని, వారిలో చాలామంది వికలాంగులుగా మారారని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్ధుల సంస్థ పేర్కొంది.