
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం- శుక్రవారం మధ్యాహ్నం 11.30 – 12.30 గంటల మధ్యలో కొందరు సాయుధులు ముసుగులు ధరించి మంగళూరు శివార్లలోని కోటెకారు వ్యవసాయ సేవా సహకార బ్యాంక్పై దాడి చేశారు. తుపాకులు, కత్తులు, తల్వార్లు చూపించి, బ్యాంక్ సిబ్బందిని బెదిరించి డబ్బులు దోచుకొని కారులో పారిపోయారు.
దోపిడీ సమయంలో బ్యాంకులో ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. దుండగులు 5-6 మంది ఉంటారని, వారందరూ సుమారుగా 25 నుంచి 30 ఏళ్ల వయస్సు వారని తెలుస్తోంది.
“దుండగులు హం, కన్నడ భాషల్లో మాట్లాడారని బ్యాంకు ఉద్యోగులు చెప్పారు. వారు బ్యాంకు సిబ్బందిని బెదిరించి బీరువాలు, అల్మరాలు తెరిపించి విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, డబ్బులు దోచుకెళ్లారు. వాటి మొత్తం విలువ సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. నిందితులు నల్లటి ఫియట్ కారులో పారిపోయారు. కేసు నమోదు చేశాం. నిందితులను పట్టుకోవడానికి పోలీసు బృందాలను పంపించాం.” అని చెప్పారు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్.
బ్యాంక్ దోపిడీ అనంతరం మంగళూరు వైపు దొంగలు పరారైనట్లు స్థానికులు తెలిపారు. కాగా, హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లో బీదర్‌కు చెందిన ఇద్దరు దొంగలు తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. కాల్పుల్లో గాయపడ్డ బస్సు డ్రైవర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బీదర్‌లోని శివాజీ చౌక్‌లో గురువారం ఉదయం ఏటీఎం కేంద్రంలో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న సెక్యూరిటి సిబ్బందిపై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి, వారి దగ్గర నుంచి రూ.93 లక్షలు లాక్కుని పరారయ్యారు.
కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డు, మరో వ్యక్తి మృతి చెందారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ వచ్చిన దుండగులు 3 గంటల పాటు అఫ్జల్‌గంజ్‌లో తలదాచుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 7 గంటలకు ట్రావెల్స్ బస్ బోయిన్‌పల్లి నుంచి బయల్దేరాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ నుంచి సాయంత్రం 6 గంటలకు ట్రావెల్స్ మినీబస్సులో ఎక్కారు. ఈ క్రమంలో బ్యాగును పైన పెట్టేందుకు బస్ డ్రైవర్ ప్రయత్నించాడు. బ్యాగు చాలా బరువుగా ఉండటంతో అనుమానం వచ్చి చూడగా అందులో నగదు గుర్తించాడు. ఇంతలో ఇద్దరు దొంగల్లో ఒకడు తన దగ్గర ఉన్న గన్ తీసుకుని కాల్పులు జరిపి పరార్ అయ్యారు. మరో వ్యక్తిని పట్టుకునేందుకు బీదర్‌తో పాటు రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్నారు.
ఈ బ్యాంకు దోపిడీ ఘటనపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ముఖ్యమంత్ర కారయక్మం నుంచి మధ్యలోనే వచ్చేశారు. దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు డాగ్స్క్వాడ్, వేలిముద్రల నిపుణులు సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ విషయంపై సీనియర్ పోలీస్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.
More Stories
భారత్ లో ప్రవేశంకు సిద్దమవుతున్న టెస్లా
ఏపీలో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి
కొత్త సీఈసీగా జ్ఞానేశ్‌కుమార్