హైడ్రోజన్ రైలును పరిచయం చేసిన భారత్

హైడ్రోజన్ రైలును పరిచయం చేసిన భారత్

భారత్ మరో కీలక ఘట్టాన్ని సాధించింది. తొలిసారిగా 1200 హార్స్ పవర్ సామర్థ్యంతో నడిచే హైడ్రోజన్ రైలు ఇంజన్ ను అభివృద్ధి చేసింది. ప్రపంచంలో అమెరికా, చైనా, జర్మనీ వంటి దేశాల వద్ద మాత్రమే ఇలాంటి రైలు ఇంజిన్లు ఉండగా, వాటి సామర్థ్యం 500-600 హెచ్ పి ఎస్ మధ్యే ఉంటుంది. కానీ భారత్ తయారు చేసిన ఈ హైడ్రోజన్ ఇంజిన్ 140 కిలోమీటర్ల వేగంతో నడవడమే కాక, డీజిల్ లేదా విద్యుత్ అవసరం లేకుండా పనిచేస్తుంది. 

త్వరలోనే ట్రయల్ రన్ ప్రారంభించనుంది. హైడ్రోజన్ రైళ్లను ప్రపంచం ఫ్యూచర్ ట్రాన్స్‌పోర్ట్‌గా చూస్తోంది. ఈ రైళ్ల ఫ్యూయల్ సెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, వాటి ద్వారా ఇంజిన్ నడుస్తుంది. ఇవి పూర్తిగా కాలుష్య రహితమైనవి, వీటి పని సమయంలో బైప్రొడక్ట్‌గా నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. 

ఇది భారత ప్రభుత్వానికి 2070 నాటికి జీరో ఎమిషన్ టార్గెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించనుంది. హైడ్రోజన్ రైళ్ల మరొక ముఖ్యమైన ప్రయోజనం ఎలక్ట్రిఫికేషన్ లేకుండా ట్రాకులపై నడిచే సామర్థ్యం. ఇది భారత రైల్వేకు అదనపు ప్రాముఖ్యతనిస్తుంది. ఎలక్ట్రికల్ వైరింగ్ అవసరం లేకుండా, డీజిల్ వినియోగం తగ్గడంతో భారీగా ఖర్చు ఆదా అవుతుంది. గ్రామీణ, వెనుకబడి ప్రాంతాల్లోనూ ఈ రైళ్లు ఆపరేట్ చేయగలవు.

హైడ్రోజన్ రైళ్లను వినియోగంలోకి తేవడం ద్వారా రైల్వే వ్యవస్థ ఆర్థికంగా మేలు పొందుతుంది. డీజిల్ ఆధారిత ఇంధనాలపై వ్యయం తగ్గిపోవడమే కాక, పర్యావరణానికి హాని కలిగించే ఎమిషన్లు తగ్గుతాయి. వీటితో పాటు భారత ఆవిష్కరణ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంలో సహాయపడుతుంది.  భారత్ తయారుచేసిన హైడ్రోజన్ రైలు ఇంజిన్ తన అత్యున్నత టెక్నాలజీ సామర్థ్యాన్ని నిరూపించింది. ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా, మరింత వేగంగా సాగడానికి భారత్ సిద్ధమైందని ఈ ప్రాజెక్ట్ స్పష్టం చేస్తోంది. ఇది దేశీయ అభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది.