విచారణకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ గైరాజర్

విచారణకు దక్షిణ కొరియా అధ్యక్షుడు  యూన్‌ గైరాజర్

సైనిక పాలన విధించి అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌-యోల్‌ తనపై మంగళవారం జరిగే తొలి విచారణకు హాజరుకావడం లేదని చెప్పారు. అభిశంసనపై ఈ నెల 14న జరిగే మొదటి విచారణకు ఆయన సహకరించలేదు. భద్రతా కారణాల రిత్యా అభిశంసనపై సోమవారం జరగనున్న మొదటి విచారణకు యూన్‌ హాజరుకాలేరని ఆయన తరపు న్యాయవాది ఆదివారం తెలిపారు. 

భద్రత, ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతాయని, దీంతో జనవరి 14న విచారణకు యూన్‌ హాజరుకాలేరని న్యాయవాది యూన్‌ కబ్‌ కీన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. భద్రతా సమస్యలు తొలగితే యూన్‌ ఎప్పుడైనా విచారణకు హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. యూన్‌ అభిశంసనను కొనసాగించాలా? లేదా తిరిగి పదవిలోకి తీసుకోవాలా? అనేది కోర్టు నిర్ణయిస్తుంది.

జనవరి 14 నుండి ఫిబ్రవరి 4 వరకు ఐదు సార్లు విచారణకు హాజరుకావాలని రాజ్యాంగ న్యాయస్థానం యూన్‌ను ఆదేశించింది. అభిశంసనకు గురైనప్పటి నుండి యూన్‌ అధ్యక్ష భవనంలోనే ఉంటున్నారు. పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను అరెస్ట్‌ చేయడంలో విఫలమయ్యారు.

మరోవైపు యూన్‌ను అరెస్ట్‌ చేయాలంటూ సియోల్‌లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఆయనను అరెస్ట్‌ చేయాలంటూ శనివారం మధ్యాహ్నం వేలాది మంది కొరియన్లు గడ్డకట్టే చలిని కూడా లెక్క చేయకుండా సియోల్‌ సెంటర్‌లోని ప్రధాన రహదారులపైనిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆయనను అరెస్ట్‌ చేయాలంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.