ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు భారతీయులకు ఇవాళ కెనడా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. బ్రిటీష్ కొలంబియా అత్యున్నత కోర్టులో ఫిబ్రవరి 11వ తేదీన మళ్లీ ఈ కేసుపై విచారణ జరగనున్నది. హత్య కేసులో ఆధారాలు సరిగా లేని కారణంగా.. నిందితులకు బెయిల్ మంజూరీ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
కరణ్ బ్రార్, అమన్‌దీప్ సింగ్, కమల్‌ప్రీత్ సింగ్, కరణ్‌ప్రీత్ సింగ్‌లపై ఫస్ట్ డిగ్రీ మర్డర్, కుట్ర కేసు నమోదు అయ్యింది. బ్రిటీష్ కొలంబియా రాష్ట్రంలోని సర్రేలో ఉన్న గురుద్వారా వద్ద నిజ్జార్‌ను 2023, జూన్ 18వ తేదీన కాల్చి చంపిన విషయం తెలిసిందే. కెనడా రాయల్ పోలీసులు.. 2024 మే నెలలో కరణ్‌ప్రీత్, కమల్‌ప్రీత్, కరన్ బ్రార్‌ను అరెస్టు చేశారు.
వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ముగ్గురు నిందితులు ఇవాళ కోర్టు విచారణకు హాజరయ్యారు. ఒకరు నేరుగా కౌన్సిల్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో ప్రత్యక్షంగా భారత హస్తం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో కీలక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది. తీవ్రవాదానికి, ఇండియా వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తున్నట్లు భారత్ కౌంటర్ ఆరోపణ చేసింది.
More Stories
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ
అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభం