
దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులందరినీ ఫేస్ బుక్ వాడకానికి దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియా వాడకం కానీ, అందులో న్యాయపరమైన అంశాలపై పోస్టులు పెట్టడం కానీ చేయొద్దని జడ్డీల్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్. కోటేశ్వరీ సింగ్ లతో కూడిన ధర్మానం సూచించింది.
సన్యాసుల్లా ఉండాలని, గుర్రాల్లా పరిగెత్తాలని కూడా ధర్మాసనం జడ్డీలందరినీ కోరింది. న్యాయమూర్తులు, న్యాయాధికారులు ఫేస్ బుక్ జోలికి వెళ్లొద్దని, తీర్పులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. న్యాయవ్యవస్ధలో ఆడంబరానికి తావు లేదని వ్యాఖ్యానించింది. ప్రొబేషన్ సమయంలో సంతృప్తికరంగా పని చేయలేదని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇద్దరు మహిళా న్యాయాధికారుల్ని తొలగించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఇందులో ఒకరు ఫేస్ బుక్ లో పోస్టు పెట్టడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఆరుగురు మహిళా సివిల్ జడ్జీలపై కేసును రద్దు చేసింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. వీరిలో నలుగురిని పునఃపరిశీలన తర్వాత తిరిగి చేర్చుకున్నారు.
కానీ ఇద్దరు అదితి కుమార్ శర్మ, సరితా చౌదరిని మాత్రం తీసుకోలేదు. 2017, 2018లో నియమితులైన ఈ న్యాయమూర్తులు తమ ప్రొబేషన్ వ్యవధిలో పనితీరు ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యారంంటూ జూన్ 2023లో ఉద్వాసనకు గురయ్యారు. దీన్ని సవాల్ చేస్తూ వారు దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.
More Stories
ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు
మహాకుంభ్లో 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు
కేరళ దేవాలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి