బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకి వ్యతిరేకంగా యావత్ భారతీయ సమాజం స్పందించాలని బిజెపి ఏపీ అధికార ప్రతినిధి ఆర్. డి విల్సన్ పిలుపిచ్చారు. కావలి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంచి పాక కమల, కావలి నియోజకవర్గం కన్వీనర్ సీవీసి సత్యం, పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మనందంతో కలిసి మాట్లాడారు.
నోబిల్ శాంతి బహుమతి పొందిన ప్రస్తుత బంగ్లాదేశ్ అధ్యక్షులు యానస్ బంగ్లా దురాగతాలకు కారణమని విమర్శించారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన బంగ్లాదేశ్ హిందువులను విడుదల చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల మంది బంగ్లాదేశ్ హిందువుల మీద అరాచకాలు జరుగుతుంటే భారత్ లోని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు పెదవి విప్పడం లేదని ధ్వజమెత్తారు.
బంగ్లాదేశ్ లో హిందువులు మతం మారాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఒకవేళ ఇక్కడే ఉండాలంటే పన్నులు కట్టాలని (జిజియా పన్నుల తరహాలో ) ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అక్కడ హిందువులు ఆస్తులు అమ్ముకొని బయటికి రావాలన్నా రాలేని పరిస్థితిలోకి నెట్టి వేయబడ్డారని, కనీసం ఆస్తులు బదలాయింపుకి ఒప్పకోవడం లేదని విల్సన్ తెలిపారు.
బంగ్లాలో సెక్యులర్ రాజ్యాంగలో ఉన్నప్పటికీ హిందువులపై ధమన కాండ జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చెబుతూ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి జషీయుద్దీన్ ఇది మా దేశ అంతర్గత విషయం అని అనడం దుర్మార్గం అని విల్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవ హక్కులు అక్కడ ధ్వంసం అవుతా ఉంటే ప్రశ్నించ లేకపోవడం దారుణమని తెలిపారు.
బంగ్లా హిందువులకు భారత్ సమాజం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బంగ్లాలోని హిందువులకు మద్దతుగా మాట్లాడుతున్న ఇస్కాన్ సంస్థ బాధ్యులు చిన్మయ్ ని అరెస్ట్ చేయడాన్ని విల్సన్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాలో నిజమైతే ఇస్లామీ తీవ్రవాదులు, బి ఎన్ పి పార్టీ కార్యకర్తలు క్రూరంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోదని విల్సన్ హెచ్చరించారు.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి