రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. బుధవారం నుంచి మూడేళ్లపాటు ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళవారం (డిసెంబర్ 10, 2024)తో పదవీకాలం ముగియనున్న శక్తికాంత దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఆర్‌బిఐ 26వ గవర్నర్‌గా మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారి. ఆయన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ, యుఎస్ఏ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు.
33 ఏళ్ల కెరీర్‌లో మల్హోత్రా పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాలలో పనిచేశారు. రెవిన్యూ కార్యదర్శిగా నియమితులు అవ్వకముందు ఆర్థిక సేవల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. రెవెన్యూ శాఖ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఆయనకు రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయంలో చాలా అనుభవం ఉంది.
ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కోసం పన్ను విధాన రూపకల్పనలో మల్హోత్రా కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంస్కరణలు, బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం, పన్నుల పెరుగుదలలో కీలక పాత్ర పోషించారు. భారతదేశం గణనీయమైన ఆర్థిక సవాళ్లను, సంస్కరణలను ఎదుర్కొంటున్నందున ఆయన నాయకత్వం క్లిష్ట సమయంలో వస్తుంది.
More Stories
సైఫ్ అలీఖాన్ కుటుంభం రూ. 15,000 కోట్ల ఆస్తుల జప్తు!
మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు
అటల్ పెన్షన్ యోజన రూ.10వేలకు పెంపు?