ఓ వర్గం దాఖలు చేసిన పిటిషన్ను మూడు పని దినాల్లోగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు విచారణ చేపట్టి సర్వే విషయంలో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే వరకు ట్రయల్ కోర్టు ఆ అంశాన్ని ముందుకు తీసుకెళ్లదని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 8కి వాయిదా వేసింది.
ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని మసీదు కమిటీకి ఇవాళ సుప్రీంకోర్టు సూచించింది. షాహీ ఈద్గా మసీదు వద్ద గతంలో హరిహర హిందూ దేవుళ్ల ఆలయం ఉన్నట్లు వేసిన పిటీషన్ ఆధారంగా సర్వే చేపట్టేందుకు ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఆ కేసులో స్పందిస్తూ శాంతి, సామరస్యాన్ని పాటించాలని అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో కోరింది.
సంభాల్ ఘటనపై న్యాయపరమైన దర్యాప్తును కోరుకుంటున్నామని సమాజ్వాద్ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ తెలిపారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయమైన విచారణ జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
మరోవైపు, సంభాల్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇక్బాల్ మెహ్మూద్ గుర్తుచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమిత్ మోహన్ ప్రసాద్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ జైన్‌లు కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ప్రజలను తమ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయమని ఇప్పటికే చెప్పినట్టు వెల్లడించారు. న్యాయపరమైన విచారణను కోరుతున్నట్లు చెప్పారు.
More Stories
ర్యాగింగ్పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం