ఒక రాష్ట్రం ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయాలని నిర్ణయించుకుంటే.. అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం కీలక సూచనలు చేసింది. కేంద్ర సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులచే దర్యాప్తు చేయబడిన, దర్యాప్తు చేస్తున్న కేసుల్లో పోటీ అంశాల మధ్య సమతున్యతను పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఈడీ అధికారి అంకిత్ తివారీ లంచం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సమాఖ్య నిర్మాణంలో, ప్రతి భాగం దాని గుర్తింపు, అధికార పరిధిని కలిగి ఉండేలా చూసుకోవాలని చెప్పింది. అలాంటి పరిస్థితిలో రాష్ట్రానికి ప్రత్యేక అరెస్టు అధికారం ఉందని చెబితే, అది సమాఖ్య నిర్మాణానికి ప్రమాదకరమని తెలిపింది.
అయితే తమ పరిధిలోని కేసును దర్యాప్తు చేసే అధికారాన్ని రాష్ట్ర పోలీసులకు లేకుండా చేయడం సరికాదని కూడా ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ పోటీ అంశాల మధ్య సమతుల్యతను సాధించేందుకు ఇరుపక్షాల వాదనలు పరిశీలిస్తామని చెప్పింది. విచారణలో నిందితుడు తన పక్షాన్ని ప్రదర్శించలేనప్పటికీ, న్యాయమైన దర్యాప్తునకు ఆయనకు హక్కు ఉందని పేర్కొంది.
కేసు విచారణను జనవరిలో విచారించనున్నట్లు తెలిపింది. లంచం ఆరోపణలపై అంకిత్ తివారీకి సుప్రీం మార్చి 20న మధ్యంతర బెయిల్‌ను జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అంకిత్ తివారీ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.అంకిత్ తివారీని తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ (డీవీఏసీ) లంచం ఆరోపణలపై అరెస్టు చేసింది. మధురైలోని ఈడీ సబ్ జోనల్ కార్యాలయంలో విధుల్లో ఉన్న అంకిత్ తివారీ 2023 డిసెంబర్ 1న తమిళనాడుకు చెందిన ప్రభుత్వ అధికారి నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు చేసినట్లు డీవీఏసీ పేర్కొంది.
ఆ తర్వాత ఈడీ తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్ర విజిలెన్స్ అధికారులు మధురైలోని జోనల్ కార్యాలయంలోకి చొరబడి కేసు రికార్డులను దొంగిలించారని ఆరోపించారు. విచారణ సందర్భంగా తమిళనాడు తరఫు న్యాయవాది వాదిస్తూ లంచం తీసుకుంటుండగా తివారీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని, కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందని వాదనలు వినిపించారు. ఈడీ పిటిషన్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నందున పోలీసులు ఇంకా ఛార్జిషీట్ దాఖలు చేయలేదన్నారు.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం