తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఎం మహేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 45 అప్లికేషన్లు రాగా అందులో రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫసర్లు కూడా ఉన్నారు. వారిలో బుర్రా వెంకటేశంను ఎంపిక చేసిన ప్రభుత్వం.. నియామక ఆమోదం కోసం ఫైలును రాజ్‌భవన్‌కు పంపించింది. దీంతో శనివారం ఉదయం ఆ ఫైలుపై గవర్నర్ సంతకం చేశారు.
దీంతో మరో నాలుగేండ్ల సర్వీస్ ఉన్నప్పటికీ ముందుగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబర్ 2న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. 2030 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
కాగా, 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బుర్రా వెంకటేశం ఆ ఏడాది యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు, ఉమ్మడి ఏపీలో మెుదటి ర్యాంకు సాధించాడు. వివిధ జిల్లాలో అడిషనల్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేద కుటుంబంలో పుట్టి.. తన ఏడవ ఏటనే తండ్రిని కోల్పోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ట్యూషన్లు చెబుతూ ఎంతో కష్టపడి సివిల్స్ సాధించారు. 2019లో ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పేరుతో ఆయన ఇంగ్లిష్‌లో ఓ పుస్తకాన్ని రచించారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు