అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ సురక్షితంగా లేరన్న అభిప్రాయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తం చేశారు. కజకస్తాన్‌లోని అస్తానాలో జరిగిన సీఎస్టీవో సదస్సులో పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ క్షేమంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీర పట్ల పుతిన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆ ఎన్నికల్లో అనాగరిక పద్ధతిలో పోరు జరిగిందని ఆయన తెలిపారు. అనేక మార్లు ట్రంప్‌పై హత్యాయత్నాలు కూడా జరిగినట్లు చెప్పారు. తన దృష్టిలో ట్రంప్ సేఫ్‌గా లేరని పుతిన్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు అమెరికా చరిత్రలోనే ఎన్నడూ జరగని రీతిలో అనేక సంఘటనలు ఇటీవల జరిగినట్లు తెలిపారు.
ట్రంప్‌పై ప్రశంసలు కురపించారు పుతిన్. ఆయన అనుభవం ఉన్న, ఇంటెలిజెంట్ నాయకుడని కొనియాడారు. ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. రష్యాలో బందిపోట్లు కూడా అలాంటి పద్ధతులను ఆశ్రయించరని పుతిన్ స్పష్టం చేశారు.
పెన్సిల్వేనియాలో జూలై 13వ తేదీన ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ బుల్లెట్ ఆయన చవిలోంచి దూసుకెళ్లింది. ఆ ఘటనలో ఓ షూటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ సెప్టెంబర్‌లో రెండోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులో ఓ వ్యక్తి నుంచి ఆయుధాలను సీజ్ చేశారు.
పాశ్చాత్య క్షిపణులతో రష్యాపై దాడి చేయడానికి కైవ్‌ను అనుమతించడం ద్వారా ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని తీవ్రతరం చేయాలనే బిడెన్ పరిపాలన తీసుకున్న నిర్ణయం గురించి ప్రస్తావిస్తూ ట్రంప్‌కు ఏదైనా వెనక్కి తీసుకోవడానికి లేదా తయారు చేయడానికి ఏదైనా ఇవ్వడం ద్వారా అతనికి సహాయం చేయడానికి ఇది ఒక ఎత్తుగడ కావచ్చని చెప్పారు.
లేదా రష్యాతో సంబంధాలను మరింత కష్టం కావించే ప్రయత్నం కావచ్చని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, ట్రంప్ “పరిష్కారం కనుగొంటారు” అని తాను భావిస్తున్నానని పుతిన్ చెప్పారు. మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
More Stories
పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్
సిరియా నుంచి 75 మంది భారతీయుల తరలింపు
చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు