కాగా, రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధంలో దీర్ఘశ్రేణి క్షిపణులను వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికాఅధ్యక్షుడు జో బైడెన్ అనుమతించారు. దీంతో అమెరికా సరఫరా చేసిన ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ (ఏటీఏసీఎం)ను వినియోగించేందుకు ఉక్రెయిన్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి.
చాలా రోజులుగా ఈ క్షిపణులను వినియోగించేందుకు అనుమతివ్వాలని అమెరికాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుతున్నప్పటీ అమెరికా మాత్రం అంగీకరించడం లేదు. కుర్స్ సరిహద్దు ప్రాంతంలో ఇంతకుముందు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న తమ భూభాగాన్ని మళ్లీ దక్కించుకోవాలని రష్యా ప్రయత్నిస్తున్న వేళ బైడెన్ తన నిర్ణయాన్ని మార్చుకొని అంగీకరించారు.
రష్యాకు ఉత్తర కొరియా పంపిన 12 వేల మంది సైనిక బలగాలను కుర్స్ సరిహద్దులో రష్యా మోహరిస్తున్నది. ఇదే సమయంలో దీర్ఘశ్రేణి క్షిపణులను యుద్ధంలో వాడేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతివ్వడంతో యుద్ధం మరింత తీవ్రం కానున్నదనే అనుమానాలు బలోపేతం అవుతున్నాయి.
అమెరికా నిర్ణయం యుద్ధంలో ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘పాశ్చాత్య దేశాల ఆయుధాలను ఉక్రెయిన్ వినియోగించడం అంటే నాటో బలగాలు ప్రత్యక్షంగా యుద్ధానికి దిగినట్టే భావించాల్సి ఉంటుంది’ అని గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
దానితో అణ్వాయుధాల వినియోగంపై రూపొందించిన కొత్త విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నూతన అణ్వాయుధ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు ఆయన పూర్తి అధికారాలు ఇచ్చేశారు. తమ శత్రు దేశానికి మద్దతు ఇచ్చే దేశాల వద్ద సుదీర్ఘ దూరం ప్రయాణించే మిస్సైళ్లు ఉన్నప్పుడు, ఆ దేశంపై అణ్వాయుధంతో దాడి చేసేందుకు తాము కూడా సిద్ధంగా ఉంటామని ఇటీవల రష్యా ఓ కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసింది. దాని ప్రకారం ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాలపై కూడా దాడి చేసేందుకు వెనుకాడబోమని రష్యా స్పష్టం చేసింది.
తాజాగా ఈ వ్యాఖ్యలను రష్యా అధికార ప్రతినిధి ద్మిత్రి పెస్కోవ్ గుర్తు చేశారు. జో బైడెన్ యంత్రాంగం మూడో ప్రపంచ యుద్ధం ముప్పును తీసుకొస్తున్నట్టే అని రష్యా ఎంపీ మారియా బుటినా వ్యాఖ్యానించారు. ‘ఇది మూడో ప్రపంచ యుద్ద ఆరంభం దిశగా వేసిన పెద్ద అడుగు. రష్యా వెంటనే స్పందిస్తుంది’ అని ఆ దేశ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ డిప్యూటీ హెడ్ వ్లాదిమిర్ డ్జాబారోవ్ పేర్కొన్నారు. దీంతో రష్యా స్పందన ఎలా ఉంటుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం