వ్యాక్సిన్ల‌ను వ్య‌తిరేకించే ఆర్ఎఫ్‌కేకు ఆరోగ్య‌శాఖ

వ్యాక్సిన్ల‌ను వ్య‌తిరేకించే ఆర్ఎఫ్‌కేకు ఆరోగ్య‌శాఖ
 అమెరికా ఆరోగ్య‌శాఖ మంత్రిగా రాబ‌ర్ట్ ఎఫ్ కెన్న‌డీ జూనియ‌ర్‌ను ఎన్నికైన అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ నియ‌మించారు. ఆరోగ్య‌శాఖ బాధ్య‌త‌ల‌ను ఆర్ఎఫ్‌కే జూనియ‌ర్‌కు అప్ప‌గించ‌డం ప‌ట్ల వివాదం చెల‌రేగుతున్న‌ది. డెమోక్ర‌టిక్ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చే కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న‌కు రిప‌బ్లిక‌న్ల సెగ త‌గిలే అవ‌కాశాలు ఉన్నాయి. 
 
కరోనా స‌మ‌యంలో టీకాల‌ను ఆర్ఎఫ్‌కే వ్య‌తిరేకించారు. దీంతో పాటు ఆయ‌న‌పై అనేక కేసుల్లో అభియోగాలు ఉన్నాయి. అనేక వివాదాల్లోనూ ఆర్ఎఫ్‌కేకు పాత్ర ఉన్న‌ది.  ఆరోగ్య శాఖ మంత్రిగా రాబ‌ర్ట్ కెన్న‌డీ ఆహార భ‌ద్ర‌త‌తో పాటు వైద్య ప‌రిశోధ‌న‌, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చూసుకోవాల్సి ఉంటుంది. 
 
అయితే ఈ శాఖ‌ను ప‌ర్య‌వేక్షించేందుకు రాబ‌ర్ట్ కెన్న‌డీ ఎంత వ‌ర‌కు అర్హుడు అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. వ్యాక్సిన్ల వ‌ల్లే ఆటిజం వ‌స్తుంద‌ని ఆయ‌న గ‌తంలో పేర్కొన్నారు. జాతీయ ప్ర‌జా ఆరోగ్య ఏజెన్సీ, సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌(సీడీసీ) లాంటి సంస్థ‌ల‌ను ఇక ఆర్ఎఫ్‌కేనే చూసుకోవాల్సి ఉంటుంది.

అధ్యక్ష పదవికి పోటీలో నిలిచిన రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ అనంతరం పోటీ నుంచి వైదొలిగి ట్రంప్‌కు మద్దతు పలికారు. కెన్నెడీ కొన్నేళ్లుగా అమెరికాలో టీకా వ్యతిరేక సిద్ధాంతకర్తలలో ప్రముఖంగా ఉన్నారు.  ట్రంప్ ఎన్నికల విజయం తర్వాత తన ప్రసంగంలో మంచి రోజులను ఆస్వాదించమని పర్యావరణవేత్త అయిన కెన్నెడీ జూనియర్‌ను కోరారు.

దేశ ఆరోగ్య సంక్షోభానికి దోహదపడే హానికరమైన రసాయనాలు, కాలుష్య కారకాలు, పురుగుమందులు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఆహార సంకలనాల నుండి ప్రతి ఒక్కరినీ రక్షించడంలో హెచ్.హెచ్.ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ట్రంప్ అన్నారు. కెన్నెడీ వ్యాక్సిన్‌ల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని ఆరోపించారు. రాబర్ట్ జూనియర్ యుఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ మేనల్లుడు, మాజీ సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ కుమారుడు.