అలాగే మతం ఆధారంగా బుల్డోజర్ యాక్షన్ ఉండకూడదని కోర్టు చెప్పింది. అధికార యంత్రాంగం జడ్జీలు కాదని, సంబంధిత వ్యక్తి నిందితుడు లేదా దోషి అయినంత మాత్రాన అతని ఆస్తులను కూల్చేయకూడదని ధర్మాసనం పేర్కొంది. ప్రతీకారం తీర్చుకోవడానికి బుల్డోజర్ యాక్షన్ తీసుకోవద్దని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఇల్లు ప్రాథమిక హక్కు అని, నిబంధనలు పాటించకుండా దాన్ని లాక్కోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఏకపక్ష చర్యలకు బదులు నిబంధనలు పాటించాలని కోర్టు చెప్పింది. ప్రభుత్వం ప్రజలకు ఎంత జవాబుదారీగా ఉంటుంది, వారి హక్కులను ఎంతవరకు పరిరక్షిస్తుందనే దానిపై ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఆధారపడి ఉంటుందని గుర్తు చేసింది.
వారి ఆస్తులను కూడా పరిరక్షించాలని, చట్టపరమైన ప్రక్రియను అనుసరించకుండా బుల్డోజర్ యాక్షన్ చేయకూడదని చెప్పింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి సుప్రీంకోర్టు బుల్డోజర్ చర్యకు సంబంధించి మార్గదర్శకాలను నిర్దేశించింది.
లిఖితపూర్వక నోటీసు ఇవ్వకుండా ఎవరి ఆస్తులను కూల్చడానికి వీల్లేదని కోర్టు తెలిపింది. ఈ నోటీసును కనీసం 15 రోజుల ముందు పొందాలి. రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపి సంబంధిత భవనానికి అతికించాలి. భవనాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారో కూడా వివరించాలి. ఈ చర్యను నిరోధించడానికి ఏం చేయవచ్చో కూడా అదే నోటీసులో చెప్పాల్సి ఉంటుంది.
ఏదైనా ఆస్తిపై బుల్డోజర్ చర్య తీసుకునే ముందు, దాని యజమానికి వ్యక్తిగతంగా విచారించడానికి అవకాశం ఇవ్వాలి. దీంతో పాటు అధికారులు ఉత్తర్వులపై మౌఖిక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కోర్టు మార్గదర్శకాలను పాటించారో లేదో నిర్ధారించడానికి బుల్డోజర్ చర్యను కూడా వీడియో తీయాలి. నిందితులు, దోషులకు కొన్ని హక్కులు ఉంటాయని కోర్టు చెప్పింది. బుల్డోజర్ల న్యాయంపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. రాత్రికి రాత్రే మహిళలు, చిన్నారులను వీధుల్లో చూడడం సంతోషకరమైన అంశం కాదు అని కోర్టు వెల్లడించింది.
More Stories
ర్యాగింగ్పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం