ఈ దీర్ఘశ్రేణి క్షిపణిని తీర ప్రాంతం, యుద్ధ నౌకల నుంచి లక్ష్యాలపైకి ప్రయోగించ వచ్చని రక్షణ అధికారులు తెలిపారు. ఈ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని శత్రు నౌకలను నావికాదళం తుదముట్టించగలదని చెప్పారు. భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను ఈ దీర్ఘశ్రేణి క్షిపణుల రాక మరింత ఇనుమడింపజేస్తోందని వెల్లడించారు.
ప్రళయ్ వంటి స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదించగల క్షిపణుల చేరికతో ఇండియన్ ఆర్మీ, వాయుసేనల పోరటపటిమ మరింత పెరిగ్గా దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణులతో సముద్రజలాల్లో గస్తీ సామర్థ్యం మరింతగా పెరుగుతుందని విశ్లేషించారు. శత్రువుల నుంచి ఎటువంటి భద్రతా సవాళ్లు ఎదురైన వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ శాఖ ఎప్పటికప్పడు అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు అధికారులు చెప్పారు.
క్షిపణులే కాకుండా భారత్, సరికొత్త యుద్ధ విమానాలను సిద్ధం చేస్తోంది. వైమానిక దళంలో అతికొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను డీఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనాను ఏవియేషన్ ఎక్స్‌పో ఐడాక్స్ 2024లో డీఆర్డీఓ ప్రదర్శించింది. 2028 నాటికి దీని ప్రాథమిక వెర్షన్‌ను సిద్ధం చేయాలని చూస్తోంది.
గతంలో తమిళనాడులోని సూలూరులో జరిగిన ఏవియేషన్ ఎక్స్‌పో ఐడాక్స్ 2024లో ఏఎంసీఏ ఫైటర్ జెట్ నమూనాను డీఆర్డీఓ ప్రదర్శించింది. 2035 నాటికి ఇవి భారత్ అమ్ములపొదిలో చేరనున్నాయి. ఈ యుద్ధ విమానం సిద్ధమైతే, స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవనుంది.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం