ఐరాస ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజి (యుఎన్‌ఎఫ్‌సిసిసి) కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29వ సెషన్ అజర్‌బైజాన్ రాజధాని బాకులో సోమవారం నుంచి 12 రోజుల పాటు జరుగుతుంది. దీనికి ప్రపంచ దేశాల నాయకులతో బాటు 50 వేల మంది దాకా ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రభుత్వ అధికారులు, విధాన రూపకర్తలు, యువత, పర్యావరణ వేత్తలు, ప్రచార కర్తలు అందరూ క్లౖౖెమేట్ ఫైనాన్సే సిఓపి ప్రధాన ఎజెండాగా ఉండాలని కోరుతున్నారు.
ఈ లక్ష్య సాధనకు వారు పట్టుదలతో ఉన్నారు. వాతావరణ సంబంధిత సమస్యలను ఎదుర్కొవటానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రతీ ఏడాది ఎంత సహాయం చేయాలనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు.. 2009లో నిర్ణయించిన 100 బిలియన్‌డాలర్ల పరిహారాన్ని పెంచాలని అడుగుతున్నారు. ఈ ఏడాదితో దీని గడువు ముగియనుంది. వాతావరణ మార్పులను తట్టుకోవడానికి ఈ సహాయం సరిపోదని వారు పేర్కొంటున్నారు. అయినా ఈ సహాయం కూడా గత 15 ఏళ్లల్లో ఒకసారి మాత్రమే (2022లో) నెరవేర్చగలిగారు.
క్లెమేట్ ఫైనాన్స్‌పై న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ (ఎన్‌సిక్యూజి)కి సహకరించాలని ఇప్పటికే సంపన్న దేశాల ప్రభుత్వాలకు ప్రచారకులు పిలుపున్చిచారు. ఏడాదికి 50వేల కోట్ల డాలర్లు లేదా ఒక లక్షల కోట్ల డాలర్లు లేదా ప్రపంచ జిడిపిలో 1 శాతం కంటే తక్కువ ఉండొచ్చని కొంత మంది అంచనా వేస్తున్నారు. మరికొంత మంది 5 ట్రిలియన్ డాలర్లకంటే ఎక్కువ ఉండొచ్చనని చెబుతున్నారు.
‘స్వచ్ఛమైన ఇంధనం, తక్కువ కార్బన్ పరిష్కరాలు అవలంభించడానికి, తీవ్రమవుతున్న వాతావరణ ప్రభావాలు తట్టుకోవడానికి మిగిలిన దేశాలకు సహాయం చేయడానికి అత్యంత కాలుష్యకారమైన సంపన్నదేశాలకు ఒక లక్ష్యాన్ని నిర్ధేశించడం చాలా అవసరం’ అని వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ సహాయాన్ని అందించేసే దేశాల జాబితాపై కొంత సందిగ్థత నెలకుంది.
ఐరాస ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యుఎన్‌ఎఫ్‌సిసిసి) నిర్వచనం ప్రకారం ‘అధిక ఆదాయ దేశాలు’ ఇంగ్లండ్, అమెరికా, జపాన్, జర్మనీ దేశాలు ఈ సహాయాన్ని అందించాలి. అయితే గత 30 ఏళ్లల్లో చైనా, దక్షిణ కొరియా, భారత్ వంటి దేశాల ఆర్థిక శక్తి, విడుదల చేసే కార్బన్ ఉద్గారాలు గణనీయంగా పెరిగాయని మరికొంత మంది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాబట్టి క్లైమేట్ ఫైనాన్సింగ్ అందించే దేశాల జాబితాను విస్తరించడానికి కూడా ఈ సదస్సులో చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు.
అలాగే ఏఏ దేశాలకు ఆర్థిక సహాయం, రుణాలు ఇవ్వాలనే అనే అంశంపై కూడా చర్చలు జరిగే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా సరే ‘క్లైమేట్ ఫైనాన్స్’ పైనే కాప్29లో ఎక్కువ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ‘క్లైమేట్ ఫైనాన్స్ అనేది దాతృత్వం, లేదా దాతృత్వానికి సంబంధించినది కాదు. ఒక బాధ్యత, అమలు చేయాల్సిన న్యాయం’ అని ఎన్‌జిఒ మెర్సీ కార్ప్స్ పేర్కొంది. ‘వాతావరణ సంక్షోభానికి ఎక్కువగా కారణమైన వారు పరిష్కారం యొక్క భారాన్ని కూడా భరించాలి’ అని తెలిపింది.
అలాగే, క్లైమేట్ ఫైనాన్స్‌ను అందించడానికి ప్రపంచ బడా సంపన్నలు, పెట్టుబడిదారులు, కాలుష్యానికి ఎక్కువగా కారణమయ్యే ప్రముఖ సంస్థలపై అధిక పన్నులు వసూలు చేయాలని కొంతమంది సూచిస్తున్నారు. ఇలాంటి చర్యలకు బ్రిటన్ వంటి దేశాల్లో ప్రజల నుంచి విశేష మద్దతు ఉందని వీరు అంటున్నారు.అయితే క్లైమేట్ ఫైనాన్స్ ఏ రూపంలో ఉన్న దానికి జవాబుదారీతనం, వార్షిక లక్ష్యసాధన ఉండాలని, లేకపోతే క్లైమేట్ ఫైనాన్స్ నిరర్థకమవుతందని నిపుణల మాట.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు