హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజకీయాల్లో బిసి రిజర్వేషన్ల కల్పన కోసం బిసిల జనాభా లెక్కలు తీ సేందుకు ప్రత్యేక కమిషన్ ఉండాలని హైకోర్టు స్పష్టం చే సింది. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో బి సి రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు త లెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకొని ముందుకు వె ళ్లాలని ఇప్పటికే సిఎం స్పష్టం చేశారు.
కమిషన్ రిజర్వేషన్లపై స మగ్ర అధ్యయనం చేసి నెల రోజుల లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనం, సమకాలీన పరిస్థితులపై ఈ కమిషన్ అధ్యయనం చేస్తుంది.ఈ కమిషన్‌కు అవసరమైన సమాచారం, గణాంకాలు సేకరించడం కోసం వివిధ సంస్థలు, వ్యక్తుల నుండి సహాయం తీసుకోవచ్చని తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుండి, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థల సహకారం తీసుకోవచ్చని పేర్కొంది. కమిషన్ నిపుణులు, పరిశోధకులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా వారి సేవలను పొందవచ్చు. కమిషన్‌కు అవసరమైన సిబ్బంది, వారికి చెల్లించే వేతనాలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన గుడ్ల ధర
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు