ఎన్నికలకు ముందు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. డీజీపీ రష్మీ శుక్లాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణం ఆదేశాలు అమలులోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాంగ్రెస్ సహా రాజకీయ పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది.
రష్మీ శుక్లా స్థానంలో వివేక్ ఫన్సాల్కర్‌కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించారు. రష్మీ శుక్లా స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
డీజీపీ నియామకం కోసం మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో సీఈసీ రాజీవ్ కుమార్ అధికారులు నిష్పక్షపాతంగా ఉండడంతో పాటు విధులను నిర్వర్తించే సమయంలో పక్షపాతంగా కనిపించకుండా చూసుకోవాలని హెచ్చరించారు.
అక్టోబర్ 259న రాజీవ్ కుమార్ మహారాష్ట్రలో రాజకీయ ప్రేరేపిత నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రష్మీ శుక్లాను ఆదేశించారు. ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య రాజకీయంగా సంచలనం సృష్టించింది. అక్టోబరు 12న బాంద్రా ఈస్ట్‌లో ముగ్గురు ముష్కరులు ఆయనను కాల్చి చంపిన విషయం తెలిసిందే.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
లింగాయత్‌ల కోటా పోరుపై పోలీసుల లాఠీచార్జి