ప్రతి నెలా శుక్రవారాల్లో రిజర్వ్‌బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా రుణాలు అందిస్తుంది. మంగళవారం అన్ని రాష్ట్రాల నుంచి ఇండెంట్లు ఆహ్వానించడం, వాటిపై శుక్రవారం రుణాలు అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మొత్తం ఏడు నెలల్లో రూ. 48 వేల కోట్ల వరకు తనఖాల ద్వారా రుణాలు తీసుకున్నారు. ఈ ఏడు నెలల కాలంలో కేవలం ఆరు శుక్రవారాలు మాత్రమే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉండగా, మిగిలిన అన్ని వారాల్లోనూ సెక్యూరిటీలు తనఖా పెట్టడం గమనార్హం.
ఏప్రిల్, జూలై, ఆగస్టు, సెప్టెరబర్ నెలల్లో ఒక్కో శుక్రవారం రుణాలకు వెళ్లకపోగా, అక్టోబర్‌లో రెండు సార్లు రుణాలకు దూరంగా ప్రభుత్వం ఉంది. అలాగే మే నెల్లో అత్యధికంగా రూ. 15 వేల కోట్లు రుణాలుగా తీసుకోగా, అత్యల్పంగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో మూడేసి వేల కోట్ల చొప్పున రుణ సేకరణ నిర్వహించారు. అలాగే మొత్తం రూ. 48 వేల కోట్ల రుణాన్ని 50 విడివిడి రుణ దరఖాస్తులతో తీసుకున్నారు.
అలాగే గత ప్రభుత్వ హయాంలో 74 రోజుల్లో ఎనిమిది పర్యాయాలు రూ. 23 వేల కోట్లు సేకరించగా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత 140 రోజుల్లో మరో ఎనిమిది సార్లు రుణాలు తీసుకున్నారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు నెలవారీగా తీసుకున్న రుణాలు (రూ. కోట్లలో) నెల రుణం: ఏప్రిల్ 6,000, మే 15,000, జూన్ 9,000, జూలై 5,000, ఆగస్టు 7,000, సెప్టెంబర్ 3,000, అక్టోబర్ 3,000, మొత్తం 48,000.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్