ఇటీవల కాలం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతున్నా అందులోని లొసుగులను ఆధారంగా చేసుకొని మోసగాళ్లు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ మోసాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నా కొత్త కొత్త పద్ధతుల్లో లూటీలకు పాల్పడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న నేరాలను కట్టడి చేసేందుకు కేంద్రం ఇటీవల కఠిన చర్యలు చేపట్టింది.
ఇటీవల టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆన్‌లైన్ మోసాల నుంచి కాపాడేందుకు సరికొత్త రూల్‌ని ప్రవేశపెట్టింది. బ్యాంకులు, ఈ-కామర్స్ సైట్స్ తదితర ఆర్థిక సంస్థల నుంచి వచ్చే లావాదేవీలు, సర్వీస్ మెసేజ్‌లు ఇంతకు ముందు ఎలాంటి నిబంధనలు లేకుండా పంపేందుకు వీలుండేది. అయితే, ఇలాంటి ఓటీపీ మెసేజ్‌లను ఉపయోగించి ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయని ట్రాయ్ పేర్కొంది.
వీటిని అరికట్టేందుకు ఆయా మెసేజ్‌లను ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి అమలు చేయాలని టెలికం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. కానీ, టెలికం కంపెనీలు మాత్రం నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధంగా లేవు. ఈ క్రమంలో గడువును ట్రాయ్ వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలు చేయాలని పేర్కొంది. టెలికం సంస్థలు ఈ రూల్స్‌ని అమలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
మెసేజ్‌లను ఫిల్టర్ చేసి పంపే క్రమంలో జరిగే ఆలస్యంతో వినియోగదారుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం సైతం ట్రాయ్‌కి కీలక విజ్ఞప్తి చేసింది. సెక్యూరిటీ, సేఫ్టీ కోసమే ఈ రూల్‌ని తీసుకువచ్చినా ఇప్పటికిప్పుడు అమలు చేయలేమని, వెంటనే పొడిగించాలని కోరింది. భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘంలో జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా తదితర టెలికం కంపెనీలున్నాయి. ఇక స్పామ్ కాల్ప్, ఓటీపీ మెసేజ్‌లను ఫిల్టర్ చేసే విధానం ఇక జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నది.
More Stories
ర్యాగింగ్‌పై కఠిన చర్యలు చేపట్టండి
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు
ఉచిత రేషన్ కార్డుల జారీపై`సుప్రీం’ అభ్యంతరం