విమానాలకు బాంబు బెదిరింపులపై రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

విమానాలకు బాంబు బెదిరింపులపై రంగంలోకి కేంద్ర ప్రభుత్వం

ఇటీవల విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. గురువారం ఒకే రోజు మరో 95 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. గత 11 రోజుల్లో 275 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం ఒకే రోజు ఎయిర్‌ ఇండియా, ఇండిగో, విస్తారా, ఆకాస ఎయిర్‌లైన్స్‌కు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. 

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫేక్‌ కాల్స్‌పై దృష్టి సారించింది. ఈ క్రుటల వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ఏర్పాటు చేసింది.  కాల్స్‌, సందేశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని మెటా, ఎక్స్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారాల సహాయం కోరింది. ఫేక్‌ కాల్స్‌ను గుర్తించేందుకు మల్టినేషనల్‌ టెక్‌ కంపెనీల సహకారం సైతం కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం విమానాలను లక్ష్యంగా చేసుకొని బాంబులు పెట్టామంటూ ఫేక్‌ కాల్స్‌ చేస్తున్న కొందరు వ్యక్తులను గుర్తించామని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  అయితే, ఈ ఫేక్‌ కాల్స్‌, మెసేజెస్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటి వెనుక ఎవరున్నారు? అనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. 

అయితే, ఫేక్‌ కాల్స్‌, మెసేజ్‌లకు సంబంధించిన డేటా వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం మెటా, ఎక్స్‌ కంపెనీలను అభ్యర్థించిందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ప్రజల భద్రత నేపథ్యంలో కంపెనీలు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో విమానంలో బాంబు పెట్టామంటూ చాలా నకిలీ కాల్స్‌, మెసేజ్‌లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని దుమ్నా విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చివేయబోతున్నామని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడు. అది ఫేక్‌ కాల్‌గా తేలింది.