భారత రాజ్యాంగం మౌళిక రూపకల్పనలో లౌకికవాదం అనే భావన కూడా ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. లౌకికవాదం, సామ్యవాదం పదాలను రాజ్యాంగ పీఠికలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్ర మంత్రి డా. సుబ్రమణియం స్వామి అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆ కేసును విచారించింది. 4
”ఈ పదాలు 1976 42వ సవరణలో చేర్చబడ్డాయి. దీంతో భారత్ వివరణను ‘సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం’ నుండి ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం’గా మార్చబడింది. అలాగే రాజ్యాంగ ప్రవేశికలో ‘దేశ ఐక్యత’ అనే పదాన్ని ‘దేశ ఐక్యత, సమగ్రత’ గా మార్చబడింది.
రాజ్యాంగ పీఠిక నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. బిజెపి నేతలు సుబ్రమణియన్ స్వామి, అశ్విని కుమార్ ఉపాధ్యారు, బలరామ్ సింగ్‌లు తాజా పిటిషన్‌లను దాఖలు చేశారు. . లౌకికవాదం ఎల్లప్పుడూ రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో భాగంగానే పరిగణించాలని కోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసిందని జస్టిస్ ఖన్నా మౌఖికంగా పేర్కొన్నారు.
రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదం, పార్ట్ III పార్ట్ కింద ఉన్న హక్కులను పరిశీలిస్తే రాజ్యాంగం ప్రధాన లక్షణం లౌకికవాదం అనే స్పష్టమైన సూచననిస్తుందని తెలిపారు. భారత్ లౌకిక రాజ్యంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా? అని పిటిషనర్లను ప్రశ్నించారు. పిటిషనర్లు సవరణను సవాలు చేస్తున్నారు కానీ భారత్ సెక్యులర్ అని పిటిషన్లు వివాదం చేయడం లేదని సింగ్ తరపు న్యాయవాది విష్ణు శంకర్ పేర్కొన్నారు. ప్రవేశిక 1949 డిక్లరేషన్‌గా ఉన్నందున సవరణ ఏకపక్షమని స్వామి వాదించారు. భారత్ ఎల్లప్పుడూ లౌకికదేశంగానే ఉంటుందని ఉపాధ్యాయ పేర్కొన్నారు.
సవరణ ద్వారా చేర్చిన పదాలు బ్రాకెట్స్‌లో ప్రత్యేకంగా మార్క్ చేశారని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు. దీంతో 1976 సవరణ ద్వారానే ఈ పదాలను చేర్చారని ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమౌతుందని చెప్పారు. ఐక్యత, దేశ సమగ్రత పదాలను కూడా సవరణల ద్వారానే చేర్చారని సూచించారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ మూడోవారానికి జాబితా చేశారు.
భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనేది భాగమైందే అని సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగ పీఠికలో ఉన్న సోషలిస్టు, సెక్యులర్ పదాలను పాశ్చాత్య దేశాల కోణంలో చూడాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొన్నది. 42వ సవరణ ద్వారా ఆ రెండు పదాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే భారతీయ కోణంలో ఆ పదాలకు అర్ధాలు భిన్నంగా ఉన్నట్లు ధర్మాసనం తెలిపింది.సామ్యవాదం అంటే అందరికీ అవకాశం ఇవ్వడమే అని, సమానత్వం అన్న భావన ఉంటుందని, దీన్ని పాశ్చాత్య భావనగా భావించవద్దు అని, భిన్నమైన అర్థాలు ఉంటాయని, అలాగే సెక్యులరిజం అన్న పదం కూడా భిన్నమైందని కోర్టు పేర్కొన్నది.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
సంచలన ఆరోపణలు చేసే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూసివేత
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి