గడ్చిరోలి జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు హతం

గడ్చిరోలి జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు హతం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మృతిచెందారు. మరోవైపు మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవానుకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్‌ను చికిత్స కోసం నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ కమాండో టీమ్‌ కూంబింగ్‌ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దాంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. గడ్చిరోలిలో నక్సలైట్లు ఎక్కువగా సంచరిస్తున్నారు.  సోమవారం  పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన  కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని  గడ్చిరోలి ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు. 

గడ్చిరోలి జిల్లాలోని భ్రమాఘడ్‌లో భద్రతా దళాలు కూంబింగ్‌ చేపడుతుండగా.. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని.. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారన్నారు.  భద్రతా దళాలకు చెందిన ఓ జవాన్‌కు గాయాలు కాగా.. ఆయన్ను హెలికాప్టర్‌లో నాగపూర్‌ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

నెలరోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ కాల్పుల పోరు జరిగింది. నవంబర్ 20 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్టా దాడి చే సేందుకు మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవు ల్లో కొందరు నక్సలైట్లు మాటువేశారని గడ్చిలోని ఎస్ పి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నక్సలైట్లు మాటు వేసిన ప్రదేశం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి చెందిన నక్సల్ ప్రభావిత నారాయణ్‌పూర్ సరిహద్దులని తెలిపింది

కాగా, ఇటీవల నక్సలైట్ దంపతులు రూ.8 లక్షల రివార్డు తీసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు.  ఆ దంపతులను అసిన్ రాజారామ్ కుమార్ (37) అలియాస్ అనిల్, అతని భార్య అంజు సుళ్య జాలే (28) అలియాస్ సోనియాగా గుర్తించారు. రాజారామ్ కుమార్ ఒడిశాలోని మావోయిస్టుల ప్రెస్ టీమ్‌లో ఏరియా కమిటీ సభ్యుడు అని పోలీసులు తెలిపారు. అతను హర్యానాలోని నర్వానా గ్రామానికి చెందినవాడు. హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లా సమీపంలోని ఓ ప్రాంతంలో నకిలీ గుర్తింపుతో నివసిస్తున్నాడు.