![జవాన్లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధపూజ జవాన్లతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ ఆయుధపూజ](https://nijamtoday.com/wp-content/uploads/2024/10/Rajnath-1024x576.jpg)
దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డార్జిలింగ్ లోని శుక్నా కంటోన్మెంట్‌లో శనివారంనాడు భారత జవాన్లతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయుధ పూజ చేసి వీరజవాన్లకు తిలకం దిద్దారు. రక్షణ మంత్రి తొలుత ‘కలశ పూజ’తో ఆచారాలను ప్రారంభించారు, తర్వాత ‘శాస్త్ర పూజ’, ‘వాహన్ పూజ’ జరిపారు. జవాన్లకు, వారి కుటుంబాలకు విజయ దశమి శుక్షాకాంక్షలు తెలిపారు.
వారిలో ఒకడిగా విజయదశమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ”శస్త్రపూజను ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకొనే కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. మన ఆరాధ్యదైవాలను పూజించేటప్పుడు శస్త్రపూజ చేయడం మన సంప్రదాయం. దేశంలోని ప్రొఫెషనల్స్ అంతా ఏడాదికి ఒకసారి తమ పనిముట్లను పూజించడం మనం చూస్తుంటాం” అని తెలిపారు.
“దీపావళి, వసంత పంచమి రోజున విద్యార్థులు ఇంక్, పుస్తకాలకు పూజలు చేస్తారు. సంగీత విద్వాంసులు తమ వాయిద్యాలకు పూజు చేస్తారు. దేశంలోని అనేక కుటుంబాలు వ్యవసాయ సంబంధిత కుటుంబాలు ఉన్నాయి. శస్త్రపూజ అంటే కేవలం వాటిని పూజించడమే కాదు, పని పట్ల మనకున్న గౌరవాన్ని చాటుకోవడం కూడా అవుతుంది” అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం