డ్రైనేజీ వ్యవస్థ అంతా మూసీలోనే కలుస్తోందని, దానికి ప్రత్యామ్నయం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ కోసం రూ.లక్షా యాభై వేల కోట్ల ఖర్చు అవుతుందన్న ప్రభుత్వం ఆ నిధులను ఎక్కడి నుంచి సమీకరిస్తుందో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హయాంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలు వెలిశాయని ఆయన గుర్తు చేశారు. 40ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్లకు ప్రభుత్వమే అన్ని వసతులు కల్పించాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎవరూ ధనవంతులు లేరని చెబుతూ పేద ప్రజల ఇళ్లను కూల్చే ముందు వాళ్లతో చర్చించి ఒప్పించిన తర్వాతే ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వంకు ఆయన హితవు చెప్పారు.
మరోవైపు కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆయన వారించారు. సామాన్యుల ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు వార్తలను ఆయన ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.
హర్యానాలో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్ మాటలపై ఈసీ కూడా స్పందించి ఆ పార్టీని మందలించిందని కిషన్ రెడ్డి తెలిపారు. జమ్మూ రీజియన్‌లో కాంగ్రెస్‌కు ఒకే ఒక్క సీటు దక్కిందని, కశ్మీర్ లోయలో బీజేపీకి అధిక ఓటింగ్ శాతం నమోదైనా మెజారిటీ సీట్లు రాలేదని ఆయన తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో 29 సీట్లలో బీజేపీ గెలుపొందిందని పేర్కొంటూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇన్ని సీట్లు దక్కలేదని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
మోహన్ బాబు కుటుంభంలో ఆస్తుల విషయమై ఘర్షణ?