* ఎన్సీకి నలుగురు స్వతంత్రుల మద్దతు
నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవాయ్ సుబహ్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగింది. శ్రీగుఫ్వారా బిజ్‌బెహర్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే బషీర్ వీరే ఈ విషయాన్ని వెల్లడించారు. ఒమర్ అబ్దుల్లాను సీఎం పదవికి ఎన్నుకోవడం తమకు భావాత్మక సమయం అని మరో నేత సల్మాన్ సాగర్ పేర్కొన్నారు.
ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని చెబుతూ జమ్మూ కశ్మీర్‌కు బలమైన, శక్తివంతమైన నాయకత్వం అవసరమని, ఒమర్ అబ్దుల్లా కంటే గొప్పవారు ఎవరూ ఉండరని తానుకోవడం లేదని హస్నైన్ మసూది పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్‌సీ తన పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేస్తామని చెప్పారు.
ఫరూక్ అహ్మద్ షా మాట్లాడుతూ ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్‌పై విశ్వాసం చూపించారని సంతోషం వ్యక్తం చేశారు. 2019 ఆగస్టులో తొలగించిన హక్కుల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి పెడతామని జావేద్ బేగ్ పేర్కొన్నారు. ప్రజలు ఎన్‌సీకి ఓటు వేసి 2019 నాటి బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టంగా తిరస్కరించారని స్ఫష్టం చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని ప్రతి అంశాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేసిందని, ప్రజలు వారిని ఓటుతో ఓడించారని తెలిపారు.
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. దీంతో జమ్ముకశ్మీర్‌లో మెజారిటీ పార్టీగా రాణించింది. కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీపై ఆధారపడకుండా సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరింది.
90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్సీ 42 సీట్లు, కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు గెలుచుకున్నాయి. దీంతో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ఒమర్ అబ్దుల్లా సన్నద్ధమయ్యారు. అయితే, స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్యారే లాల్ శర్మ, సతీష్ శర్మ, చౌదరి మహ్మద్ అక్రమ్, డాక్టర్ రామేశ్వర్ సింగ్ తాజాగా ఎన్సీకి తమ మద్దతు ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో మెజారిటీ మార్క్ అయిన 46 స్థానాలకు ఎన్సీ బలం పెరిగింది.
మరోవైపు జమ్ము ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ ఊహించినట్లుగానే 29 సీట్లు గెలుచుకున్నది. ముగ్గురు స్వతంత్రుల మద్దతుతో ఆ పార్టీ సంఖ్యా బలం 32కు చేరింది. అయితే మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఈ ఎన్నికల్లో కుప్పకూలింది. 2014లో 28 స్థానాలు గెలిచిన ఆ పార్టీ ఈసారి దారుణంగా మూడు సీట్లలో మాత్రమే గెలిచింది.
More Stories
హైడ్రామా మధ్య అధికారిని కొట్టిన స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్
హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో వైద్య విద్య
శబరిమల భక్తుల కోసం ’స్వామి’ ఏఐ చాట్‌బాట్