తరచూ ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండే ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ తాజాగా మహిళల గురించి చాలా దారుణంగా మాట్లాడి మరో వివాదానికి తెరలేపారు. ఒక మగాడికి వివాహమైనప్పటికీ మహిళలు అతడిని పెళ్లాడటం ఏమాత్రం తప్పు కాదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. లేదంటే ఒకవేళ ఒక మహిళ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే బజారు మనిషిలా మిగిలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇలా మహిళలను కించపర్చేలా మాట్లాడి జకీర్ నాయక్ పై గతంలో మనీ లాండరింగ్‌కు పాల్పడటంతోపాటు, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. దాంతో 2016లో అతను భారత దేశాన్ని విడిచిపెట్టి మలేషియాకు మకాం మార్చాడు.
గత ఎనిమిదేళ్లుగా అతడు ఒక్కసారి కూడా భారత్‌లో అడుగుపెట్టలేదు. అయితే తీవ్ర అభియోగాల నేపథ్యంలో జకీర్ నాయక్‌ను భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా, జకీర్ నాయక్ ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. ఆ దేశంలోని కీలక నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ సహా పలు ఇతర ప్రాంతాల్లో అతను ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
ఈ క్రమంలోనే అతను చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇస్లాం మతం ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లాడేందుకు అనుమతిస్తుంది. అంటే అప్పటికే పెళ్లయి భార్య వున్న పురుషుడు మరో మహిళను ఇష్టపడవచ్చు. పెళ్లాడి సంతానాన్ని కూడా పొందవచ్చు.
ఇదే విషయాన్ని గుర్తుచేసిన ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఈ సాంప్రదాయం తప్పేమీ కాదనేలా వాఖ్యలు చేసాడు. పెళ్లికాని స్త్రీకి సమాజంలో గౌరవం లేదని నాయక్ పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి దొరకకపోతే ఆ అమ్మాయి ముందు రెండు దారులు వుంటాయని, ఒకటి పెళ్లిచేసుకోకుండా మిగిలిపోవడం, రెండోది పెళ్లయిన వ్యక్తిని వివాహం చేసుకోవడమని జకీర్ నాయక్ హితవు చెప్పాడు.
అయితే ఇందులో పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కంటే పెళ్లయిన వ్యక్తికి భార్యగా వెళ్లడమే మంచిదని చెప్పుకొచ్చాడు. అలాంటి పెళ్లితో ఆమెకు గౌరవం పెరుగుతుందని జాకీర్ నాయక్ చెప్పాడు. పెళ్లి చేసుకోకుండా వుండిపోయేవాళ్లు ‘బజార్ ఔరత్’ (బజారు మహిళ) గా మిగిలిపోతారంటూ జకీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పెళ్ళి కాని మహిళలు పబ్లిక్ ప్రాపర్టీగా అతడు పేర్కొన్నారు. రెండో పెళ్లో లేక మూడో పెళ్లో.. మొత్తానికి పురుషుడితో వుంటేనే మహిళకు గౌరవమని సంచలన పేర్కొంటూ గౌరవప్రదమైన స్త్రీలు పెళ్లి చేసుకోడానికే ఇష్టపడతారని వింతయినా భాష్యం ఇచ్చాడు.
More Stories
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హతం
షేక్ హసీనాను అప్పగించమని కోరటం లేదన్న యూనుస్
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండించిన ట్రంప్