కాగా, ఇద్దరు మైతీ వ్యక్తుల నిర్బంధం గురించి ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో వారి విడుదల కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. కాంగ్‌పోక్పి జిల్లాలోని కుకీ సివిల్ సొసైటీ గ్రూప్ కమిటీల గిరిజన ఐక్యత సంఘం (సీవోటీయూ) మధ్యవర్తిత్వం వహించింది. ఇరు వర్గాలతో చర్చలు జరిపింది. ఇంఫాల్ జైలులో ఉన్న కుకీ-జో ఖైదీలందరినీ వారి ఆధిపత్య ప్రాంతమైన చురచంద్‌పూర్‌కు తరలించాలని, కాంగ్‌పోక్పి జిల్లాలోని ఫైలెంగ్‌మోంగ్‌లో కొత్త పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇద్దరు మైతీలను నిర్బంధించిన కుకీ గ్రామ వలంటీర్లు డిమాండ్ చేశారు.
మరోవైపు ప్రభుత్వంతో చర్చల తర్వాత ఇంఫాల్ జైలులో ఉన్న కుకీ, జో వర్గాలకు చెందిన 11 మందిని సపర్మీనాలోని జైలుకు తరలించారు. అలాగే ఫైలెంగ్‌మాంగ్‌లో పోలీస్ స్టేషన్‌ను రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న ఇద్దరు మైతీ వ్యక్తులను కుకీ గ్రామ వలంటీర్లు విడుదల చేశారు.
కాగా, విడుదల చేసిన ఇద్దరు మైతీ వ్యక్తులను కుకీ సివిల్ సొసైటీ గ్రూప్ గురువారం పోలీసులకు అప్పగించింది. ఈ సందర్భంగా ఈ రెండు జాతుల మధ్య ఘర్షణలు మొదలైన 17 నెలల తర్వాత మైతీ, కుకీ సభ్యులు తొలిసారి ఒకరినొకరు హత్తుకున్నారు. మైతీ యువకులు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర అధికారులకు సీఎం బీరెన్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు.
More Stories
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ మంత్రివర్గం విజయం
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం