టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో సూపర్ విక్టరీ కొట్టింది ఇండియా. కాన్పూర్‌లో డ్రా అవుతుందనుకున్న మ్యాచ్‌ను గెలిచి చూపించింది టీమిండియా. టీ20 తరహా విధ్వంసంతో బంగ్లాదేశ్‌ను వణికించిన భారత జట్టు చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. స్వదేశంలో వరుసగా 18వ సిరీస్ విక్టరీతో చరిత్ర సృష్టించింది.
రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి అందుకున్నది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఓపెనర్ జైస్వాల్ తన పవర్ హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు తగ్గ క్రికెట్ స్ట్రోక్స్‌తో చెలరేగిపోతున్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 51 రన్స్ చేసి ఔటయ్యాడు. కోహ్లీ 29 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు ఉదయం బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 రన్స్‌కు ఆలౌటైంది. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్, జడేజాలు చెరి మూడేసి వికెట్లు తీసుకున్నారు. జడేజా మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి.. భారత గెలుపునకు బాటలు వేశాడు.
అయిదో రోజు 26 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. కేవలం 146 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో ఇండియాకు స్వల్ప టార్గెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చాలా డేరింగ్ గేమ్ ఆడింది. వాస్తవానికి వర్షం వల్ల రెండు రోజుల ఆట రద్దు అయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా చాలా వేగంగా స్కోర్ చేసింది. నాలుగో రోజు ఫటా ఫటా రన్స్ రాబట్టింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్ కన్నా ఎక్కువ రన్స్ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. ఇక అయిదో రోజు అంతే వేగంగా బంగ్లా బ్యాటర్లను ఔట్ చేసి విజయానికి మార్గం సులువు చేసుకున్నది. భారత బౌలర్లు, బ్యాటర్లు.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తుఫాన్‌లా విరుచుకుపడ్డ విరాట్ కోహ్లీ మ్యాచ్ ముగియగానే ప్రత్యర్థి ఆటగాళ్లను కలిశాడు. ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ ను ఓదార్చాడు. భారత్‌పై చివరి టెస్టు ఆడేసిన అతడికి విరాట్ ప్రత్యేక బహుమతి అందించాడు.
న్పూర్ టెస్టు సమయంలోనే టీ20లకు.. టెస్టులకు సైతం వీడ్కోలు ప్రకటించిన షకీబ్‌కు కోహ్లీ తన సంతకంతో కూడిన బ్యాట్‌ను బహూకరించాడు. దిగ్గజ ఆటగాడి నుంచి.. కెరీర్‌లో చివరి టెస్టు వేళ మర్చిపోలేని బహుమతి దక్కడంతో షకీబ్ సంబురపడిపోయాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం షకీబ్ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కూడా వైదొలిగే అవకాశముంది.
More Stories
దుర్గామాతపై గర్భా గీతం రాసిన ప్రధాని మోదీ
గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన భగవత్
ఉత్కంఠ పోరులో పాక్ పై భారత్ జయకేతనం