అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ… పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే

అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ… పుదిచ్చేరిలో మ‌ళ్లీ ఏన్‌డీఏనే
* పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే
అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలెయెన్స్ (ఎన్‌ఈడీఏ) వరుసగా మూడోసారి అధికారంలోకి రానుందని పీపుల్స్ పల్స్ సర్వేలో126  వెల్లడైంది. ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎన్‌ఈడీఏగా పిలువబడుతుంది.  మరోవంక, కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది.

అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలుండగా మెజార్టీకి 64 స్థానాలు కావాలి.  2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 68-72 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 22-26 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఎన్‌ఈడీఏ కూటమిలో బీజేపీ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్ (ఏజీపీ) 7-10, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 8-9 స్థానాల్లో గెలిచే అవకాశాలుండడంతో ఎన్డీఏ కూటమి 90 స్థానాలకు చేరుకోవచ్చు.

బీజేపీ 38.6 శాతం, కాంగ్రెస్ 36.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. అస్సాం ఎన్నికల్లో ఇతర పార్టీలైన ఏఐయూడీఎఫ్, రాయిజర్ దాల్, యూపీపీఎల్, ఏజేపీ, సీపీఐ(ఎం), ఇతరుల ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తుంది. బీజేపీ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి 45 శాతం మద్దతిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగాయ్‌కు 35 శాతం మద్దతిస్తున్నారు.
అప్పర్ అస్సాంలో ఎన్డీఏ పటిష్టంగా ఉంది. మధ్య అస్సాంలోని నాగావ్, హూజాయ్, కర్బి అంగలాంగ్, దిమా హసావ్, దారంగ్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ కనిపించింది. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న లోయర్ అస్సాంలో ఏఐయూడీఎఫ్ గతంలో పోలిస్తే కొంత బలోపేతమయినా ఇక్కడ ఎన్డీఏ ఆధిపత్యం కనిపిస్తుంది.
కాగా, పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో మూడు నామినేటెడ్ స్థానాలున్నాయి.  పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16-19 స్థానాలు, సెక్యూలర్ ప్రొగ్రెసివ్ (ఎస్‌పీఏ) కూటమి 10-12 స్థానాలు, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలింది. 
2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుండి 36 శాతం, ఎస్‌పీఏ కూటమి 30 నుండి 32 శాతం, టీవీకే, ఎన్ఎమ్‌కే కూటమి 15 నుండి 17 శాతం, ఎన్‌టీకే 4 నుండి 6 శాతం, వీసీకే 1 నుండి 3 శాతం, ఇతరులు 2 నుండి 5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్‌సి పార్టీ 10-12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలవనుంది. 
 
ఎన్డీఏలోని బీజేపీ 5-6 స్థానాలు, ఎల్‌జేకే 1-2, ఏఐఏడీఎమ్‌కే 0-1 స్థానాలు గెలవొచ్చు. ఎస్‌పీఏ కూటమిలోని డీఎమ్‌కే 6-8, కాంగ్రెస్ 1-3 స్థానాలు, టీవీకే, ఇతరులు 1-2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆ కూటమి విజయానికి దోహదం చేస్తున్నాయి. 
పుదిచ్చేరిలో దాదాపు 68 శాతం మంది ముఖ్యమంత్రిగా ఎన్.రామస్వామికి మద్దతిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమిస్తామని దాదాపు 60 శాతం చెప్పగా, 36 శాతం మరోసారి అవకాశమివ్వమని చెప్పారు. పుదిచ్చేరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అవసరమని దాదాపు 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. పుదిచ్చేరిలో అభివృద్ధికి సంబంధించి 56 శాతం మంది ఏఐఎనఆర్‌సికి మద్దతివ్వగా, 24 శాతం మంది కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు.