భారత్‌లో క్లేడ్-ఐ మంకీపాక్స్ తొలి కేసు నమోదైంది. కేరళకు వ్యక్తికి ఈ వేరియంట్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదరు వ్యక్తి ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కేరళలోని మలప్పురానికి గతవారం చేరుకున్నాడు. అయితే, క్లేడ్-ఐని వ్యాప్తితోనే మంకీపాక్స్ విస్తరిస్తుందని, దాంతోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ విధించింది.
సదరు వ్యక్తి జ్వరం, శరీరంపై దద్దుర్లు కనిపించాయి. సదరు వ్యక్తి ఓ ఆసుపత్రికి వెళ్లగా.. అనుమానం వచ్చిన వైద్యుడు పరీక్ష కోసం నమూనాలను సేకరించి టెస్టుల కోసం పంపగా.. ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలింది. భారత్‌లో ఇది రెండో మంకీపాక్స్ కేసుగా తొలి కేసు ఢిల్లీలో నమోదైంది. ఎంపాక్స్ క్లాడ్ 1బీ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. ప్రధానంగా లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
దేశంలో రెండో కేసు నమోదైన నేపథ్యంలో, ఏవైనా లక్షణాలతో విదేశాల నుంచి భారత్కు వచ్చే వారు ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ సూచించారు. తద్వారా వీలైనంత త్వరగా చికిత్స పొందాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ వ్యాధి సోకిన వారికి రాష్ట్రంలో వివిధ జిల్లాలో చికిత్స, ఐసొలేషన్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో పాటు పొరుగుదేశాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. గతేడాది సైతం ఎంపాక్స్ ఆఫ్రికాలోని పలు దేశాల్లో విస్తరించింది. 2022లో 121 దేశాల్లో కేసులు నమోదయ్యాయి.
తాజాగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. జూలై 2024లో ప్రపంచవ్యాప్తంగా 1,425 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి. ఈ కేసుల్లో సగానికి పైగా ఆఫ్రికా ప్రాంతం, మరో 24శాతం అమెరికా, యూరోపియన్ ప్రాంతంలో 11శాతం కేసులు నమోదయ్యాయి. సౌత్-ఈస్ట్ ఆసియా రీజియన్ మొత్తం కేసుల్లో ఒక శాతం నమోదయ్యాయి.
More Stories
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్లకే శబరిమల అయ్యప్ప దర్శనం
నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం