ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మంది హెచ్‌ఐవీ మహమ్మారి బారినపడుతున్నారు. వేలాది మంది మరణిస్తున్నారు. రోగ నిరోధక శక్తికి దొరకకుండా హెచ్‌ఐవీ వైరస్ తరచూ మ్యుటేషన్‌కు లోనవుతుండటంతో ఈ వ్యాధిని నయం చేయడం కుదరట్లేదు.
శక్తిమంతమైన ఔషధాలు, ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఏడు వ్యాక్సిన్ డోసులతో ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. దీంతో అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు హెచ్‌ఐవీ నియంత్రణకు ఓ టీకాను అభివృద్ధి చేశారు. హెచ్‌ఐవీ నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో రెండు మోతాదులుగా ఇస్తారు.
తొలి డోసులో 20 శాతం వ్యాక్సిన్‌ను, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్‌ను రోగికి వేస్తారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని, రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు. ‘ఇంట్రెస్టింగ్ ఇంజినీరింగ్’ ఈ వివరాలను వెల్లడించింది.
More Stories
మెరీనా బీచ్ వద్ద ఎయిర్ షోలో తోక్కిసలాట.. ఐదుగురు మృతి
ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్లకే శబరిమల అయ్యప్ప దర్శనం
నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రయోగం