అయితే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం మజ్లీస్ వత్తిడులకు భయపడి మౌనంగా ఉంటూ వచ్చాయి. తెలంగాణ ఉద్యమం కాలంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే విముక్తి దినం జరుపుతామని ప్రకటించిన కేసీఆర్ సహితం ఆ తర్వాత మౌనం వహిస్తూ వచ్చారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విముక్తి దినం జరపడం ప్రారంభించడంతో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన దినంగా జరపడం ప్రారంభించింది.
దానితో తొలిసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ తమ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఉదయం 9.30 కి జూబ్లీహిల్స్ నివాసం నుండి సిఎం రేవంత్ పబ్లిక్ గార్డెన్స్‌కు బయలుదేరి గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించారు. పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
మరోవైపు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు.
‘సెప్టెంబర్ 17′ హైదరాబాద్ విమోచన దినోత్సవం’ ప్రాముఖ్యతను వివరిస్తూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారితో చిన్న ప్రదర్శన ఇస్తున్నారు. పరేడ్ మైదానంలో జాతీయ జెండాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కతీస్తూ నియంతృత్వ నిజాం నుంచి ప్రజలకు విమోచన లభించిన రోజు ఇదని తెలిపారు. నిజాంపై వేల మంది ప్రజలు విరోచితంగా పోరాటం చేశారని కొనియాడారు.
రజకార్ల మెడలు వంచడంలో దివంగత మాజీ ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్‌ది సాహసోపేత పాత్ర అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రజాకార్ల వారసత్వ పార్టీకి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు కొమ్ముకాస్తున్నాయని దుయ్యబట్టారు.
More Stories
కాంగ్రెస్ మహిళా వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం
మూసీ బాధితులు రేవంత్ ను మెచ్చుకుంటే రాజకీయాలకు స్వస్తి!
ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు హైకోర్టు తిరస్కారం