కోల్‌కతాలో నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల డిమాండ్లు నెరవేర్చేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చివరకు అంగీకరించారు. సోమవారం రాత్రి దాదాపు రెండు గంటలకు పైగా వైద్యులతో చర్చలు జరిపారు. వారు చేసిన ఆందోళనకారులు చేసిన అయిదు డిమాండ్లలో మూడింటికి మమతా సర్కార్ అంగీకరించింది.
ఇందులో భాగంగానే మంగళవారం కోల్‌కతా పోలీసు కమిషనర్‌గా కొత్త అధికారిని నియమించనున్నారు. అరోగ్య సేవల డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్‌ను తొలగించనున్నారు. ఈ నేపథ్యంలో విధులకు హాజరుకావాలని వైద్యులకు మమతా విజ్ఞప్తి చేశారు. ఆర్జీ కర్ వైద్యరాలి హత్యాచారం ఘటన తర్వాత జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరిస్తూ నెల రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు.
ఈ విషయంపై వైద్యులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా సఫలం కాలేదు. ఎట్టకేలకు చర్చలు జరిపేందుకు అంగీకరించిన వైద్యులు సోమవారం సాయంత్రం కాళీఘాట్‌లోని సీఎం మమతా బెనర్జీ నివాసానికి వెళ్లారు. మొత్తం 42 మంది వైద్య విద్యార్థుల బృందం మమతా బెనర్జీతో దాదాపు రెండు పాటు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో వైద్యులు చేసిన అయిదు డిమాండ్లలో మూడింటికి ప్రభుత్వం అంగీకరించింది.
ఇందులో భాగంగానే కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను తొలగించి, మంగళవారం కొత్త అధికారిని నియమిస్తామని తెలిపింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్‌తో పాటుగా హెల్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్‌లను సైతం ఆయా పోస్టుల నుంచి తొలగిస్తామని పేర్కొంది. మిగిలిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ కార్యాచరణ చేపట్టనుందని చర్చల ముగిసిన అనంతరం స్వయంగా మమత ప్రకటించారు.
డిమాండ్లకు అంగీకరించినందున ఆందోళనలను విరమించాలని వైద్యులను మమతా బెనర్జీ కోరారు. ఆందోళనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోమని, వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య ప్రజలు వైద్యం అందక అల్లాడుతున్నారన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని సైతం నెలకొల్పుతున్నట్లు ఆమె ప్రకటించారు.
అయితే, సీఎం మమతా బెనర్జీ అంగీకరించిన తమ డిమాండ్లు సాకారమయ్యేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.
More Stories
సచివాలయంపై నుంచి దూకేసిన డిప్యూటీ స్పీకర్
ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహంపై దుమారం
మణిపూర్‌లో తొలిసారి హత్తుకున్న మైతీ, కుకీలు