క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పారు. క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌ను ప్రమోట్ చేయాల్సి ఉందన్న సీఎం, విద్యుత్ బిల్లుల కట్టడికి ఆర్‌ఈతో పాటు కటింగ్ ఎడ్జ్ సాంకేతికత వాడాలని చెప్పారు. గ్రిడ్ నిర్వహణకు సమతూకానికి విద్యుత్ రవాణా వ్యవస్థ మెరుగు పర్చాలని, గ్రీన్ ఎనర్జీ కారిడార్లను సరిగా నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ల ద్వారా నేరుగా ట్రాన్స్‌మిషన్ చేయాలని, మాన్యుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్‌ను ప్రమోట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామన్న చంద్రబాబు, వీటి ద్వారా ఏపీకి పలు ప్రాజెక్టులు సాధించామని గుర్తు చేశారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, గ్లీన్ ఎనర్జీ సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి ఉందని తెలిపారు. నెడ్ క్యాప్ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని చెప్పారు.
ఏపీలో విన్-విన్ విధానంలో భూసమీకరణ జరుగుతుందన్న సీఎం చంద్రబాబు, భూసమీకరణ సమయంలో మానవతా కోణంలో ఆలోచిస్తామని చెప్పారు. భూసమీకరణకు ఒప్పించి సానుకూల వాతావరణం ఉండేలా చూస్తామని, కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. సంస్థలకు అవసరమైన అనుమతుల ఏర్పాటుకు కృషిచేస్తామన్న సీఎం, సౌర, పవన హైబ్రిడ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందిస్తామని, సహేతుకమైన ధరలకు భూమి లీజుకు ఇస్తామని తెలిపారు.
More Stories
తిరుమల లడ్డూ వివాదంలో ప్రత్యేక సిట్ దర్యాప్తు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆరోపణలపై కుమారస్వామి ఆగ్రహం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసి నిధులివ్వాలి