జమ్మూకశ్మీర్‌లో కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లో కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల జరిగియాయి. కొండ ప్రాంతాలైన కిష్త్వార్ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. చిత్రులోని నైదం గ్రామం సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భారత సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 
 
ఈ క్రమంలో భద్రతా బలగాలపై దాడి జరగడంతో నలుగురు జవాన్లు గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని సమీపంలోని కమాండ్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఇద్దరు మరణించారు. సాయుధ బలగాలు ఉగ్రవాదులను తిప్పికొట్టాయి. 
 
అయితే, ఉగ్రవాదులు అడవుల్లో దాక్కున్నట్లు సమాచారం అందడంతో ఎన్‌కౌంటర్ ప్రదేశానికి మరిన్ని బలగాలను పంపించారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాగా, గత జులై లో డోడాలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులే నేటి ఎన్కైంటర్లోనూ పాల్గొన్నట్టు అధికారులు భావిస్తున్నారు.అయితే, శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది. ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంతానాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్ లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని రోదా, డిష్ణ్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిస్త్వార్, లేదా, కాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది.